పవన్ కళ్యాణ్ జనసేనపై జై లవకుశ అదిరిపోయే కామెంట్స్!

ఇప్పుడు తెలుగు సినిమాలో స్టార్ హీరోలు అంటే పవన్ కళ్యాణ్, తారక్ ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో ఇద్దరి గురించి మాట్లాడేటపుడు చాలా మంది ఇద్దరి వ్యక్తిత్వాలని చాలా దగ్గరగా పోల్చి చెబుతారు. ఇద్దరి ఆలోచనలు చాలా వరకు ఒకేలా ఉంటాయని కూడా ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన ప్రస్థానం కొనసాగిస్తూ ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ స్థాయిలో రాజకీయాల్లో ఎన్టీఆర్ మానియా కూడా ఉంది అనేది కాదనలేని నిజం. అలాగే రాష్ట్రంలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా ఎన్టీఆర్ ని అందరు చూస్తారు. మరి అలాంటి ఎన్టీఆర్ మనసులో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఉన్న అభిప్రాయం ఏమిటి అనేది అందరు తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూ లో యాంకర్ అదే ప్రశ్నని ఎన్టీఆర్ ని అడిగింది. పవన్ రాజకీయ ప్రయాణం మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన ప్రశ్నకి ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పడం విశేషం.

రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు, కాని ఫైనల్ గా రాజకీయాల్లోకి వచ్చామంటే అది ప్రజలకి సేవ చేయడానికే. అలా సేవ చేసే ఆలోచన ఉన్నవారికి తాను కచ్చితంగా సపోర్ట్ చేస్తా అని అన్నారు. అయితే ఇప్పుడు ఈ మాటకి అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు పవన్ అభిమానులు కూడా స్వాగతిస్తున్నారు. ఎన్టీఆర్ స్వచ్చమైన రాజకీయాలని కోరుకుంటున్నాడని, అలాగే ప్రస్తుత రాజకీయాల్లో మార్పు కోసం చూస్తున్నాడని, అందుకే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంకి తనదైన శైలిలో మద్దతు తెలిపాడని అంటున్నారు. ఆ మధ్య జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు కూడా ఎన్టీఆర్ పవన్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడంతో పాటు తన రాజకీయ ప్రయాణం అద్బుతంగా సాగాలని కోరుకున్నట్లు, అలాగే తన బెస్ట్ విషెస్ చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని, ఎ విషయంలో ఒకరి అభిప్రాయాలు, సలహాలు ఒకరు షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందని కూడా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *