కేటీఆర్ చేతులమీదుగాడబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో రూ. 101.69 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలకు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు గురువారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలుచేశారు. నిరుపేదలకు రూ. 9.34 కోట్లతో నిర్మించిన 108డబుల్ బెడ్ రూం ఇండ్లను  పంపిణీచేయడంతోపాటు ఇం డోర్ స్టేడియం, మోడ్రన్ ఫిష్ మార్కెట్‌ను ప్రారంభించారు. రూ.83 కోట్లతో నిర్మించనున్న రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)కి శంకుస్థాపనచేశారు. హైదరాబాద్‌లోని పేదలకోసం సుమారు రూ.8,500 కోట్లతో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇదివరకే నాచారంలోని సింగంచెరువు తండాలో ఇన్ సిటూ (స్వస్థానంలో) పద్ధతిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల కాలనీని ప్రారంభించగా, తాజాగా రెండో కాలనీని కూకట్‌పల్లి నియోజకవర్గం చిత్తారమ్మ బస్తీలో ప్రారంభించారు ఈ కాలనీలో ఇదివరకే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీచేయగా, వారు గురువారం మంత్రి చేతులమీదుగా మంత్రు లు కేటీఆర్ ప్రారంభోత్సవం అనంతరం గృహప్రవేశాలు చేశారు. మంత్రు లు కేటీఆర్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో కలిసి పాలు పొంగించి సామూహిక గృహప్రవేశాలు చేయించారు. ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు లబ్ధిదారులు బోనాలు, పటాకులతో ఘనంగా స్వాగతం పలికారు. సెల్లార్, స్టిల్ట్‌తోపాటు తొమ్మిది అంతస్తుల్లో నిర్మించిన ఈ గృహాల సముదాయంలో సెల్లార్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. స్టిల్ట్ ఫ్లోర్‌లో సుమారు 20 దుకాణాలను నిర్మించారు. లిఫ్ట్ కూడా ఏర్పాటుచేశారు. దుకాణాల ద్వారా వచ్చే అద్దెలతో ఈ ఇండ్ల సముదాయాన్ని నిర్వహించాలని నిశ్చయించారు. ఒక్కో ఫ్లాట్ వైశాల్యం 560 చదరపు అడుగులు కాగా, ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి రూ.8.65 లక్షలు ఖర్చుచేశారు. దశాబ్దాలుగా మురికివాడలోని చిన్నచిన్న గుడిసెల్లో నివసించిన కుటుంబాలకు విశాలమైన, సకల సౌకర్యాలతో కూడిన నిర్మించి తో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *