కాజల్‌ రెండు రేట్లు మెయింటైన్‌ చేస్తోంది

గత ఏడాది బ్రహ్మూెత్సవం, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌లాంటి డిజాస్టర్‌ చిత్రాల్లో నటించిన కాజల్‌ పని అయిపోయిందని అనుకున్నారు. లాస్ట్‌ ఇయర్‌ ఆమెకి ఏదీ కలిసి రాలేదు. కానీ ఈ ఇయర్‌ తను పట్టిందల్లా బంగారమవుతోంది. చిరంజీవితో చేసిన ‘ఖైదీ నంబర్‌ 150’తో కాజల్‌ బ్లాక్‌బస్టర్‌ కొట్టింది. చిరంజీవితో నటించినందుకు గాను ఆమె మార్కెట్‌ రేట్‌ కంటే ఎక్కువే పారితోషికాన్ని ఇచ్చారు.

ఆ తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’తో మరో విజయాన్ని ఆమె అందుకుంది. రీసెంట్‌గా మెర్సల్‌తో మరో బ్లాక్‌బస్టర్‌ ఆమె వశమైంది. దీంతో కాజల్‌కి మళ్లీ డిమాండ్‌ పెరిగింది. ఇటు టాప్‌ హీరోలతో పాటు అటు ఒకప్పటి సీనియర్లు కూడా ఆమెతో నటించడానికి సై అంటున్నారు. దీంతో యువ హీరోలతో నటించేందుకు ఒక పారితోషికం.

సీనియర్లతో నటించడానికి మరో రేట్‌ ఆమె ఫిక్స్‌ చేసింది. వెంకటేష్‌తో తేజ తీసే సినిమాలో నటించడానికి కాజల్‌ భారీ పారితోషికం డిమాండ్‌ చేసిందట. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో అంత అమౌంట్‌ తీసుకోని ఆమె ఇప్పుడిలా డిమాండ్‌ చేయడం నిర్మాతకి షాకిచ్చిందట. అయితే సీనియర్లతో నటించడం వల్ల తనకి యువ హీరోలతో అవకాశాలు తగ్గుతాయని, అందుచేత దానిని ఈ విధంగా బ్యాలెన్స్‌ చేస్తున్నానని కాజల్‌ చెప్పిందట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *