శంకర్ సినిమా లో కాజల్ వృద్ధురాలి గా…

దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇటీవల ఈమె జోరు కాస్త తగ్గింది.  కానీ తమిళ్ లో మాత్రం కమల్ హాసన్ సరసన సినిమా చేస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో కమల్ హాసన్ నటిస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ బ్యూటీ అందరు అనుకుంటున్నటుగానే ఈ సినిమాలో కాజల్ 85 ఏళ్లవృద్ధురాలి క్యారక్టర్ చేస్తున్నాని మేకప్ కోసమే గంటల సమయం పడుతోందని, చెప్పింది కాజల్.  తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ ఈ షాకింగ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ పాత్ర కమల్ హాసన్ తో పోటీపడేలా కమల్ తర్వాత ఆ స్థాయి పాత్ర ఇది అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా కీలకమైందని దానికోసం చాలా కష్టపడ్డానని, ఈ పాత్ర తన కెరియర్లో నిలిచిపోతుందని అంటుంది కాజల్ . ఇక ఇండియన్2 సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనీ చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *