30 కోట్లు ప్రాఫిట్ తెచ్చిన ఎన్టీఆర్

ఇప్పుడు ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ ఇచ్చిన ఊపులో కొత్తగా ‘జై లవ కుశ’ అంటూ వస్తున్నాడు. ఈ సినిమాలో ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను చేయడానికి ముఖ్యమైన ఒక కారణం ఏంటంటే.. అన్నయ్య కళ్యాణ్ రామ్ ను సేవ్ చేయడానికే. అందుకే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను తీస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూద్దాం.

నిజానికి ఈ సినిమాను 55 కోట్ల లోపు తీయాలని కళ్యాణ్ రామ్ చూస్తున్నట్లు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్రెడీ స్పెషల్ మేకప్ కోసం భారీగా ఖర్చు పెట్టేయడం వలన.. ఇప్పుడు ఇతరత్రా ఖర్చులను బాగా తగ్గించేశారు. అందుకే స్టార్ హీరోయిన్ల కోసం వెళ్లకుండా.. రాశి ఖన్నా అండ్ నివేదా థామస్ లను తక్కువ బడ్జెట్ తో ఓకె చేశారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను ఆల్రెడీ 80 కోట్ల బేరం పెట్టేశాడట కళ్యాణ్ రామ్. జనతా గ్యారేజ్ సినిమా ధియేట్రికల్ షేర్ 80 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శాటిలైట్ రైట్స్ తో కలిపి జూనియర్ సినిమాను 80కు విక్రయిస్తే.. కొనడానికి చాలామందే ఉన్నారు. అందుకే 80 దగ్గర మ్యాటర్ క్లోజ్ చేసి.. 30 కోట్లు ప్రాఫిట్ కళ్యాణ్ రామ్ జేబులో వేసుకుంటున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.

ఒకవేళ అంత లాభం వస్తే మాత్రం.. ఖచ్చితంగా గతంలో కళ్యాణ్ రామ్ కు కిక్ 2.. ఇజం వంటి సినిమాలు చేసిన గాయాలన్నీ మానిపోతాయ్. ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్నాడు కాబట్టి.. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా హిట్టు రేంజ్ కూడా పెద్దగానే ఉంటుంది. అప్పుడు మరిన్ని లాభాలు సాధించే ఛాన్సుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *