మతం మార్చుకున్న కమల్ కూతురు..

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ మతం మార్చుకున్నారు. అజిత్‌తో వీరం, వేదాలం వంటి సూపర్ హిట్లు అందించిన డైరెక్టర్ శివ, మరోసారి అజిత్ హీరోగా వివేగం సినిమా తీస్తున్న సంగతి విదితమే. ఈ సినిమాలో కాజల్, అక్షర హాసన్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్షర హాసన్ మాట్లాడారు.

మతం మార్చుకున్న వివరాలు, తాను ఎంత నిరాడంబరంగా ఉన్నది వివరించారు. తాను నటి అయినప్పుడు తానెవరన్నది, తన తల్లిదండ్రులెవరన్నది ఎవరికీ తెలియదని చెప్పారు ఆమె. ప్రజలకు తానెవరో తెలిస్తే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిని సక్రమంగా చేయలేకపోయేదాన్నేమోనని, తానెవరో తెలియకపోవడం వల్లే తెర వెనక ఏం జరుగుతోందో తెలుసుకోగలిగానని వివరించారు. తాను చేసిన తొలి ఉద్యోగం క్లాపర్ గర్ల్ అని చెప్పారు. కాగా, ముంబైలో ఉన్నప్పుడు షూటింగ్‌కు కేవలం ప్రజా రవాణ వ్యవస్థనే (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్) ఉపయోగించుకునేదాన్నన్నారు. దానికి తన తల్లిదండ్రులు కూడా అందుకు అనుమతించారని తెలిపారు. కాగా, తాను ఇటీవలే బౌద్ధ మతం స్వీకరించానని ఆమె వెల్లడించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *