షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ కంగనా

బాలీవుడ్‌ అగ్ర కథానాయిక కంగనా రనౌత్‌ పెద్ద గండం నుంచి తప్పించుకుంది. కంగనా రనౌత్‌ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక- ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్‌) దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా కంగనా తన సహనటుడు నిహర్‌ పాండేతో కత్తి సాము చేస్తుండగా కంగనా నుదురుపై కత్తి గాటు పడినట్లు సమాచారం. దాంతో వెంటనే చిత్రబృందం ఆమెని చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికితరలిచింది. కంగనా ముఖానికి 15 కుట్లు పడినట్లు చిత్రవర్గాల సమాచారం. దీంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కంగనాకు తృటిలో పెను ప్రమాదం తప్పిందని ఎముకకు దగ్గరగా కత్తి గుచ్చుకుందని వైద్యులు చెప్పినట్లు చిత్రవర్గాలువెల్లడించాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *