బన్నీ ని కాపీ చేసిన కన్నడ హీరో !

బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘సరైనోడు’. 2016లో ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం బన్నీ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్నుసాధించిన చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈచిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు మాస్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కూడా అనుకున్నాడో ఏమో చక్కగా మన స్టైలిష్ స్టార్ ను కాపీ కొట్టాడు.

నిఖిల్ తెలుసు కదా ‘జాగ్వార్’ అనే కన్నడ – తెలుగు బైలింగ్వల్ సినిమా తో తన లక్కును టెస్టు చేసుకున్నాడు. పెద్దగా ప్రయోజనం కలగలేదు కానీ ఇప్పుడు ‘సీతారామ కళ్యాణ’ అనే సినిమా తో కన్నడ ప్రేక్షకుల మనసు దోచేందుకు డిసైడ్ అయ్యాడు.  ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఆ టీజర్ చూస్తుంటే అందరికీ  మన స్టైలిష్ స్టార్ గుర్తొస్తున్నాడు.  బోయపాటి ఊరమాస్ స్టైల్ లో ‘సరైనోడు’ సినిమాలు బన్నీ యాక్షన్ సీన్స్ లో ఇరగదీస్తాడు కదా..  సరిగ్గా అదే సెటప్ ను నిఖిల్ కు సెట్ చేశారు.  బాడీ లాంగ్వేజ్ మాత్రమే అని మీరు అనుకోవద్దు.. వెనకున్న టెంపుల్ – జాతర డ్యాన్సులు అన్నీ మక్కికి మక్కి దించారు.  ఇంకో సీన్లో ‘రేస్ గుర్రం’ బన్నీ గుర్రంతో పాటు రన్నింగ్  చేస్తాడు కదా అలా ఇక్కడ నిఖిల్ ఎద్దులతో పాటు రన్ చేస్తాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *