టీజర్ కి ముందే కుమ్మేస్తున్న కాటమరాయుడు
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు మాంచి స్పీడ్ మీదున్నాడు. మామూలుగా అయితే.. రిలీజ్ కి కొన్ని వారాల ముందు వరకూ సైలెంట్ గా ఉండి.. అప్పుడు ఓ ఈవెంట్.. చిన్నా చితకా ప్రమోషన్స్ తో సినిమాలను థియేటర్లలోకి వదిలేసే పవన్.. కాటమరాయుడు విషయంలో గేర్ మార్చేశాడని తెలిసిపోతోంది.
దీపావళికి శృతితో కలిపి ఓ క్యూట్ ఫోటోతో ఆకట్టుకున్న కాటమరాయుడు.. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా కొత్త స్టిల్స్ తో నానా హంగామా చేస్తున్నాడు. మొదట రెండు పోస్టర్లలో పవన్ వాకింగ్ స్టైల్ ని మాత్రమే చూపించగా.. ఆ తర్వాత వెనకనుంచి పవన్ ను పోస్టర్ లో చూపించారు. తాజాగా కుర్చీలో ధీమాగా కూచుని సీరియస్ గా చూస్తున్న పవన్ లుక్ ని విడుదల చేసిన యూనిట్.. వీటిన్నిటితో కలిపి ఓ వీడియోగా రూపొందించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం విశేషం.
పంచె కట్టుతో ఖద్దరు దుస్తుల్లో మెడలో తువ్వాలుతో పవన్ ఇరగదీసేశాడంతే. ఇక అనూప్ రూబెన్స్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. కాటమరాయుడు థీమ్ బీట్ అయితే.. టెంపో మరింత పెంచేశాయి. జనవరి 1వ తేదీన టీజర్ ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్.. దానికి ముందే అభిమానులకు పండగపండగ చేసేస్తున్నాడు. మెగాఫ్యాన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంటే.. ఇవే ఎక్కువ కిక్ ఇచ్చేస్తున్నాయిలే.