కాటమరాయుడు.. కళ్లు చెదిరే రికార్డు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపిస్తోంది ‘కాటమరాయుడు’. వారం కిందట టీజర్ రిలీజైనప్పటి నుంచి రికార్డుల మోత మోగిపోతోంది. ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూస్.. ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్.. ఫాస్టెస్ట్ 1 ల్యాక్ వ్యూస్.. ఇలా యూట్యూబ్ లో రికార్డులు ఒకదాని తర్వాత ఒకటి బద్దలవుతూనే ఉన్నాయి. తాజాగా ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని మరో రికార్డును ‘కాటమరాయుడు’ టీజర్ అందుకుంది. యూట్యూబ్ లో 2 లక్షల లైకులు కొట్టించుకున్న తొలి టీజర్ గా ‘కాటమరాయుడు’ రికార్డు నెలకొల్పింది. ఇది ‘బాహుబలి’ లాంటి మెగా మూవీకి కూడా సాధ్యం కాని ఘనత. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్లు కూడా ఈ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయాయి.

నిజానికి ‘కాటమరాయుడు’ గురించి మొదట్నుంచి ఎక్కువగా నెగెటివ్ ప్రచారాలే జరుగుతున్నాయి. దీని మీద పవన్ గత సినిమాల స్థాయిలో హైప్ కనిపించలేదు. పైగా ఇది ఒక రీమేక్ మూవీ. అయినప్పటికీ టీజర్ ప్రకంపనలు రేపింది. అర నిమిషం టీజర్ తో.. చిన్న డైలాగ్ తో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుని తన పవరేంటో చూపించాడు పవన్. ఉగాది ముందు వీకెండ్లో.. అంటే మార్చి 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ హిట్ మూవీ ‘వీరం’కు అనఫీషియల్ రీమేక్ గా భావిస్తున్నారు. ‘గోపాల గోపాల’ ఫేమ్ కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలోనే సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *