ఒకే దెబ్బకు రెండు పిట్టలు పవన్ పై విరుచుకుపడిన కత్తి మహేశ్!

విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు జనసేన పార్టీ అధ్యక్షుడు – సినీ నటుడు పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు వైజాగ్ లో పర్యటించనున్నారు. పవన్ అభిమానులకు – ఫిల్మ్  క్రిటిక్ కత్తి మహేష్ కు మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. పలు టీవీ షోలలో కూడా ఆ రెండు వర్గాల మధ్య వాడివేడి చర్చలు నడిచాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై కత్తి మహేష్ మరోసారి విమర్శలు గుప్పించారు

నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు, అజ్ఞానవాసి అని తేలుతొంది. అంతే!

సో… మొత్తానికి జనసేన ముఖ్య ఉద్దేశం ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని మోసం చేసినవాళ్ళని చెప్పుతో కొట్టడం అన్నమాట! అది కాంగ్రెస్ తో కలిస్తేనే సాధ్యం అని చెప్పకనే చెప్పాడు. కక్ష సాధింపు ముఖ్యమైనప్పుడు లక్ష్య సాధన ఏముంటుంది?!?

నిజమే! తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని రూల్ ఏమీలేదు. అలాగే అన్న హీరో అయితే తమ్ముడూ హీరో అవ్వాలని లేదుగా!? వారసత్వం మన ఫ్యూడల్ భావజాలపు బానిస భావన. అది అన్ని రంగాల్లో పోవాలి. కాకపోతే ఎర్ర గురివింద తన నలుపెరగనట్టు మాట్లాడితేనే నవ్వొస్తుంటుంది.

తప్పు చేస్తే నన్ను కూడా నిలదీయండి! పొరపాటు చేస్తానేమోగాని.. తప్పు మాత్రం చేయను! – పవన్ కళ్యాణ్ ముందు మీ ఫ్యాన్స్ చేస్తున్న గుండాయిజాన్ని ఆపే మంచి పనిచెయ్యి. లేకపోతే, తప్పో పొరపాటో కాదు, మీకు మీ పార్టీకి అదొక గ్రహపాటుగా మారే చాన్స్ ఉంది.

టీడీపీ, బీజేపీకి మద్దతు ఇవ్వం: పవన్ కల్యాణ్, ఇక మిగిలింది వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్…చలో !

పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా. ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్తతరహా రాజకీయం. అన్నను, పి.ఆర్.పి ని మోసం చేసినవాళ్ళ సంగతి సరే…మరి అన్న గారు జనానికి, కులానికి,పార్టీకి చేసిన మోసం సంగతో!!’’

పవన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి విడుదల కాబోతోందని – దీంతో – ఒకే దెబ్బకు రెండు పిట్టలు (‘ఏక్ పంత్ దో కాజ్’) అన్న రీతిలో పవన్ విశాఖ పర్యటన సాగుతోందని మహేష్ అన్నారు. ఈ పర్యటన వల్ల ఏకకాలంలో  రాజకీయపరంగా సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుందన్నారు.ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడం తప్పు కాదని  టైమ్ తక్కువున్నందున రెండింటినీ కవర్ చేయడానికి పవన్ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పటికైనా పవన్ జనాల్లోకి వెళుతున్నారని అంతకన్నా కావలసిందేముందని వ్యాఖ్యానించారు. తాజాగా మహేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు పవన్ అభిమానులు స్పందించలేదు.

ఇవీ జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై కత్తి మహేశ్ ఇచ్చిన కౌంటర్లు. నిన్న పవన్ కల్యాణ్ హల్ చల్ చేయగా.. ఇప్పుడు దానిపై రియాక్షన్లు కొనసాగుతున్నాయి. జనసేన అధిపతి మాట్లాడి వెళ్లిన డొల్ల మాటలపై  ఇలాంటి కౌంటర్లు పడుతున్నాయి. ఇక కత్తి మహేశ్ కు పవన్ కల్యాణ్ ట్రూపుకు ఉన్న ప్రత్యేక వైరం గురించి వేరే వివరించనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఇతడి కౌంటర్లు ఆసక్తిదాయకం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *