అభిమాన క‌వికి సీఎం కేసీఆర్ ఘ‌న వీడ్కోలు

విశ్వంభ‌రుడు సినారెకు సీఎం కేసీఆర్ ఘ‌న వీడ్కోలు ప‌లికారు. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఉన్న‌ మ‌హాప్ర‌స్థానంలో ఇవాళ జ‌రిగిన సినారె అంత్య‌క్రియుల‌కు సీఎం కేసీఆర్ హాజ‌ర‌య్యారు. త‌న అభిమాన క‌వి అయిన సినారె అంతిమ‌యాత్ర‌లో ఆయ‌న పాల్గొన్నారు. ముందు ఉండి కార్య‌క్ర‌మాన్ని న‌డిపించారు. సినారె క‌వితా శైలిని విశిష్టంగా అభిమానించే సీఎం కేసీఆర్ అంత్య‌క్రియ‌ల తంతు ముగిసే వ‌ర‌కు మ‌హాప్రస్థానంలోనే ఉన్నారు. సినారె పార్దీవ‌దేహాంపై పుష్పాంజ‌లి ఉంచి కేసీఆర్ త‌న నివాళి ఘ‌టించారు.

సీఎం కేసీఆర్‌తో పాటు ప‌లువురు మంత్రులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు. గ‌న్ సెల్యూట్ చేశారు. అంతిమ‌యాత్ర‌లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సాహితీ అభిమానులు వ‌చ్చారు. తెల‌గు భాష‌, సాహిత్యం అన్నా సినారెను గుర్తుంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ర‌మ‌ణాచారి అన్నారు. ఆయ‌న సినీ క‌వియే కాదు, రాజ‌కీయ రంగంలోనూ మేటి అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *