కే‌సి‌ఆర్ పెంపుడు కుక్క…మృతి…కేసు

సీఎం కేసీఆర్‌ నివాసం ప్రగతి భవన్‌లోని ఓ పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ నెల 10న అనారోగ్యానికి గురైన 11 నెలల హస్కీ పరిస్థితి విషమించడంతో ప్రగతి భవన్‌ డాగ్స్‌ హ్యాండ్లర్‌ ఆసిఫ్‌ అలీఖాన్‌ గురువారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 4లోని యానిమల్‌ కేర్‌ క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అయితే వైద్యుడు ట్రీట్‌మెంట్‌ చేస్తుండగానే కుక్క మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే కుక్క మృతి చెందిందని ఆసిఫ్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే బహదూర్‌పురాకు చెందిన ఆసిఫ్‌ అలీఖాన్‌ ఐదేళ్లుగా ప్రగతి భవన్‌ డాగ్‌ హ్యాండ్లర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడున్న 9 పెంపుడు కుక్కలకు సంరక్షణ చూసుకుంటూ శిక్షణనిస్తున్నాడు. అయితే ఈ నెల 11న ఉదయం 7గంటలకు హాస్కి అనే కుక్క పాలు కూడా తాగకుండా తీవ్ర అస్వస్ధతకు గురైంది. వెంటనే ఆయన రెగ్యులర్‌ వెటర్నరీ డాక్టర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 2గంటలకు అక్కడకు వచ్చిన వైద్యుడు పరీక్షలు నిర్వహించగా కుక్క 101 టెంపరేచర్‌ జ్వరంతో బాధపడుతుండడంతో లివర్‌ టానిక్‌ ఇచ్చాడు. దీంతో కుక్క పరిస్ధితి మరింత విషమించింది. దీంతో రాత్రి 9గంటలకు రోడ్‌ నంబర్‌ 4లోని యానిమల్‌ కేర్‌ క్లినిక్‌కు తీసుకెళ్లి డాక్టర్‌ రంజిత్‌కు చూపించాడు. ఆయన ట్రీట్‌మెంట్‌ ఇస్తుండగానే కుక్క చనిపోయింది. డాక్టర్‌ రంజిత్‌ నిర్లక్ష్యంతోనే కుక్క చనిపోయిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అలీఖాన్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *