బంగారు తెలంగాణే నా స్వప్నం…

తెలంగాణ వస్తే ధనిక రాష్ట్రమవుతుందన్న నా మాటలు నిజమయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సకల వనరులతో సంపన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ అమరవీరులను స్మరించుకున్నారు.

అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయడంలో సఫలికృతులయ్యామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సింహభాగం సంక్షేమ పథకాలకే వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పేదింటి ఆడవారి పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు.గురుకులాలు, రెసిడెన్షియల్ కాలేజీల ఏర్పాటుతో అందరికీ విద్యను అందించేందుకు కృషిచేస్తున్నామన్నారు.

లాయర్లు,జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించామన్నారు. ప్రభుత్వం పాటించిన ఆర్ధిక క్రమశిక్షణతో ప్రగతిలో ముందున్నామని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ కిట్ తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే సకల జనుల మన్ననలు పొందామని తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల శాతం పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రసవనంతరం తల్లి,బిడ్డల క్షేమం కోసం మదర్ అండ్ బేబి కిట్ అందజేస్తున్నామని తెలిపారు. అట్టడుగు ఉద్యోగులకు వేతనాలు పెంచామని వెల్లడించారు. విద్యుత్ కొరతను అధిగమించి కోతలు లేని నాణ్యమైన విద్యుత్ అందించే స్ధితికి చేరుకున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించి రైతులు కష్టాలు తీరుతున్నాయని తెలిపారు.

ఇంటింటికీ మంచి నీరు అందించాలనే సంకల్పంతో మిషన్ భగీరథను ప్రారంభించామని …ఈ డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రహదారుల నిర్మాణం చేపట్టామని పారిశ్రామిక ప్రగతితో ముందుకు సాగుతున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్‌తో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. ఐటీ రంగంలో పెట్టుబడులు,ఉత్పత్తులు గణనీయంగా పెరిగిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్ధానంలో నిలిచామన్నారు. గ్రీన్ తెలంగాణ కోసం హరితహారం కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధను  పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయం రంగంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు సంస్కరణ చర్యలు చేపట్టామన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతుల రుణమాఫీ చేశామన్నారు. మిషన్ కాకతీయతో 16 వేల చెరువులను పునరుద్దరించుకున్నామన్నారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.రైతులకు ఎరువులను ఉచితంగా పంపిణి చేస్తున్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాంల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు.

రైతులకు 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను అందిస్తున్నామని తెలిపారు. రవాణ పన్ను రద్దు చేశామన్నారు. రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతులను సంఘటిత శక్తిగా తయారుచేస్తామన్నారు. గ్రామ రైతు సంఘాలను ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు. కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. వృత్తి దారుల సంక్షేమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో కేటాయింపులు చేశామన్నారు. 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. చేపల పంపకాన్ని అభివృద్ధి చేసి మత్య్సకారుల కళ్లల్లో ఆనందం నింపుతున్నామని చెప్పారు. సమగ్ర చేనేత విధానంతో నేతన్నలకు లబ్ది చేకూరుతుందన్నారు. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. నాయిబ్రాహ్మాణులకు లక్ష రుపాయల ఆర్ధిక సాయం అందిస్తున్నామని తెలిపారు. కల్లు గీత వృత్తిని పోత్సహించేందుకు కల్తీ కల్లును అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. సంచార కులాలను ఆదుకునేందుకు వెయ్యికోట్ల బడ్జెట్‌తో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. బంగారు తెలంగాణ సాధనకు అవిశ్రాంత కృషి చేస్తానని తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *