బాబు పరిస్థితిపై ఆసక్తికరమైన కామెంట్లు చేసిన కేసీఆర్!

మంత్రి వర్గ విస్తరణ చేసి సొంత పార్టీ నేతలతో విమర్శలను ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జాలి చూపించాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పునర్వ్యస్థీకరణ పేరుతో చంద్రబాబు కెళుక్కుని ఇబ్బందులు పడుతున్నాడని కేసీఆర్ అభిప్రాయపడ్డాడు. చంద్రబాబు ఇబ్బందులు చూశాకా.. తనకు విస్తరణ చేయాలనే ఆలోచనే రావడం లేదని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించడం విశేషం.

ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరిగాకా తెలుగుదేశం పార్టీలో రేగిన చిచ్చు గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. పార్టీలోని పాత కాపులు, కొత్తగా వచ్చి చేరిన వారు.. మంత్రి పదవులు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఎక్కారు. కొంతమంది చంద్రబాబు తీరునే విమర్శించారు. క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో అలాంటి అసమ్మతి వాదం వినిపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

ఇప్పటి కూడా తెలుగుదేశం పార్టీలో విస్తరణకు సంబంధించిన రచ్చ చల్లారలేదు. చాలా మంది నేతలు సైలెంట్ గా ఉన్నారు కానీ.. అసహనంతో వారు కాగిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తరణ చేసి చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నాడని.. తను మాత్రం అలాంటి నొప్పులు తెచ్చుకోను అని కేసీఆర్ స్పష్టం చేశారు.

మరి చంద్రబాబు పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి జాలి వ్యక్తం చేయడం ఒక విశేషం అయితే.. బాబు పరిస్థితి చూశాకా.. తనకు మంత్రి వర్గ విస్తరణ చేయాలనే ఆసక్తే పోయిందని తెలంగాణ సీఎం అనడం మరో విశేషం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *