మ‌హేష్ మోజు ప‌డ్డ యంగ్ హీరోయిన్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు తరువాత మరో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం ఏఆర్‌.మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న (వ‌ర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ‌) సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే మార్చి నాటికి కంప్లీట్ కానుంది.

ఆ సినిమా షూటింగ్ ముగిసిన వెంట‌నే మ‌హేష్ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతోపాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది.
శ్రీమంతుడు త‌ర్వాత ఇదే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు ట్రేడ్ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ప‌లువురి పేర్లు ప‌రిశీలించిన ద‌ర్శ‌కుడు శివ‌, మ‌హేష్ చివ‌ర‌కు నేను శైలజ ఫేం కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా ఉన్న కీర్తి, సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ అనగానే వెంటనే ఒప్పేసుకుందట.

ఇటీవల విడుదలైన ‘రెమో’ సినిమాలో కీర్తి సురేష్‌ నటన మ‌హేష్‌ను పిచ్చ పిచ్చ‌గా ఇంప్రెస్ చేసింద‌ట‌. దీంతో మ‌హేష్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ..ఆమె పేరునే కొర‌టాల‌కు సూచించిన‌ట్టు టాక్‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *