‘ఖైదీ నెంబర్‌ 150’ ఫంక్షన్‌ యాంకర్లెవరో తెలుసా?

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ కోసం నిర్మాత రామ్‌చరణ్‌ తేజ్‌ భారీ ఏర్పాట్లు చేస్తున్నాడు. విజయవాడలో జరుగనున్న ఈ ఫంక్షన్‌కు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మెగా హీరోలందరూ తరలివస్తున్నారు. జనవరి 4 లేదా 5 తేదీలలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.

‘సరైనోడు’, ‘ధృవ’ల మాదిరిగానే డైరెక్ట్‌గా ఈ సినిమా పాటలను మార్కెట్‌లోకి ఈ నెల 25న విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం జరుగలేదు. ఇప్పటికే ‘అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడు’, ‘సుందరీ’ పాటలను విడుదల చేసేశారు. వీటికి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభించింది. ఇక, బుధవారం ‘యూ అండ్‌ మీ’ అనే మెలొడీ పాటను విడుదల చేయనున్నారు.

ఇలా పాటలను సైలెంట్‌గా విడుదల చేసి ఓ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను విజయవాడ వేదికగా ఘనంగా నిర్వహించనున్నారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ మెగా ఈవెంట్‌కు హోస్ట్‌లుగా రానా దగ్గుబాటి, నవదీప్‌ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. వీరే ఈ కార్యక్రమాన్ని నడిపించనున్నారట. వీరిద్దరూ చరణ్‌కు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అనే విషయం తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *