రత్తాలుతో చిందేస్తున్న చిరు…

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో రాయ్‌లక్ష్మితో కలిసి చిరు చిందేశారు. ‘రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు’ అని సాగే ఈ పాటకు ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ పాటను 2 లక్షల మందికి పైగా చూడగా, 15 వేల మంది లైక్‌ చేశారు.రాఘవా లారెన్స్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

కాజల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. జనవరి 4న ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *