మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జనసేనలోకి…?

పవన్ జనసేన పార్టీ పెట్టిన తరువాత తలపండిన నేతలెవరూ ఆయన వెంటన కనిపించలేదు. కానీ.. తాజాగా ఆ లోటు తీరబోతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ లో హేమాహేమీలను కాదని సీఎం పదవి దక్కించుకోవడమే కాకుండా ఏ వర్గమూ లేకుండా పదవిని కాపాడుకున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జనసేనలో చేరనున్నట్లు టాక్.

విభజన తరువాత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానేసిన కిరణ్ ఇటీవలి కాలంలోనే ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి – సొంతపార్టీ స్థాపించి తీవ్రంగా దెబ్బతిన్న కిరణ్ రాష్ట్రవిభజన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన గురించి దాదాపుగా అందరూ మర్చిపోయారు. ఇపుడు కిరణ్ కు అధికారం – పదవులు – హోదాలాంటివి గుర్తొచ్చాయి. అందుకే తనకూ ఒక పార్టీ అజెండా కావాలని ఆయన ఆరాటపడుతున్నారు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కాంగ్రెస్ రానివ్వదు. వైసిపి లోకి వెళ్లలేరు. బిజెపిలోకి వెళతారనే ప్రచారం కూడా జరుగుతున్నా అది కూడా సాధ్యమయ్యేలా లేదు.  దీంతో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి వెళితే ఎలా ఉంటుందనేది కూడా కిరణ్ కుమార్ రెడ్డి మనసులో ఉన్న మాటని తెలుస్తోంది.

ఈ మేరకు పవన్ ను నుంచి కూడా సానుకూలత వచ్చినట్లు టాక్. అయితే పవన్ తో కలిసి ప్రయాణించడం ఎంతవరకూ సాధ్యమవుతుంది అన్నది ఇపుడు కిరణ్ ను వేధిస్తోన్న ప్రశ్న. బిజెపిలోకి ఇపుడు వెళ్లినా అటు ఆపార్టీకి గానీ ఇటు కిరణ్ కు గానీ అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. జనసేనలోకి వెళితే పార్టీ నిర్మాణంలో పాలుపంచుకోవచ్చు.  కొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *