రివ్యూ: కిరాక్ పార్టీ మూవీ

క‌థ:
కృష్ణ(నిఖిల్‌) ఉషా రామా ఇంజ‌నీరింగ్ కాలేజీలో మెకానిక‌ల్ గ్రూపులో ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో జాయిన్ అవుతాడు. ఇత‌ని గ్యాంగ్‌లో రాకేందుమౌళి స‌హా స్నేహితుల‌తో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. త‌న సీనియ‌ర్ మీరా(సిమ్రాన్ ప‌రింజ‌)తో ప్రేమ‌లో పడ‌తాడు. అందువ‌ల్ల సీనియ‌ర్స్‌తో గొడ‌వ అవుతుంది. కృష్ణ‌, అత‌ని స్నేహితులంతా క‌లిసి ఓ సెకండ్ హ్యాండ్ కారును కూడా కొని దానితో మీరాను ఇంప్రెస్ చేయాల‌నుకుంటారు. ఎదుటివారిని న‌వ్వించాల‌నే కృష్ణ మ‌న‌సు న‌చ్చడంతో అత‌నంటే ఇష్ట‌పడుతుంది. అనుకోకుండా మీరా ప్ర‌మాద‌వ‌శాతు మీరా చ‌నిపోతుంది. దాంతో కృష్ణ యార‌గేంట్‌గా మారుతాడు. ఎవ‌రైనా అమ్మాయిల‌ను కామెంట్ చేస్తే వారిని చావ‌గొడుతుంటాడు. నెమ్మ‌దిగా కృష్ణ నాలుగో సంవత్స‌రంలోకి ఎంట్రీ ఇస్తాడు. అదే స‌మ‌యంలో కృష్ణ స్నేహితుడు అర్జున్ త‌న నుండి గొడ‌వ‌ప‌డి మ‌రో వ‌ర్గంగా విడిపోతాడు. రెండు వ‌ర్గాలు కాలేజ్‌లో అధిప‌త్యం కోసం గొడ‌వ‌లు ప‌డుతుంటారు. అదే స‌మ‌యంలో స‌త్య‌(సంయుక్తా హెగ్డే) కృష్ణ‌ను ఇష్ట‌ప‌డుతుంటుంది. న‌వ్వ‌డ‌మే మ‌ర‌చిపోయిన కృష్ణ‌ను మామూలు మ‌నిషిగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తుంది. మ‌రి కృష్ణ లైఫ్ ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుంది? త‌ను స‌త్య‌కు ద‌గ్గ‌రైయ్యాడా? విడిపోయిన స్నేహితులందరూ క‌లుసుకుంటారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

ప్లస్ పాయింట్స్ :

హీరో నిఖిల్ కృష్ణ పాత్రలో బాగానే నటించాడు. మొదటి సంవత్సరం చదివే కుర్రాడిగా సరదగా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూనే కాలేజ్ సీనియర్ గా రఫ్ అండ్ టఫ్ లుక్లో కూడ మెప్పించాడు. సినిమా ఫస్టాఫ్ ఎక్కువ భాగం స్నేహితుల మధ్య, కాలేజీలో జరిగే సరదాగా సన్నివేశాలతో, చిన్నపాటి లవ్ ట్రాక్ తో నడుస్తూ ఇంప్రెస్ చేసింది. సంగీత దర్శకుడు అంజనీష్ లోకనాథ్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ ఇంప్రెస్ చేశాయి.

స్నేహితుల మధ్యన నడిచే పాట, హీరో హీరోయిన్ల నడుమ సాగే రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకున్నాయి. హీరో స్నేహితుల పాత్రలో నటించిన యువకులు కూడ ఎక్కడా లిమిట్స్ దాటకుండా సెటిల్డ్ గా పెర్ఫార్మ్స్ చేసి సినిమాకు రియలిస్టిక్ లుక్ వచ్చేలా దోహదపడ్డారు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండి ఆకట్టుకున్నాయి.

సుధీర్ వర్మ రాసిన ఫస్టాఫ్ స్కీన్ ప్లే బాగుంది. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్, హీరో ఆకట్టుకోగా సినిమా యొక్క కాలేజ్ నైపథ్యం యువతకు తమ కాలేజీ రోజుల్ని తప్పక గుర్తు చేస్తుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ చెప్పుకోడానికి బాగేనా ఉండే స్టోరీ లైన్ ను ఒక సినిమాకు కావాల్సిన పూర్తిస్థాయి మెటీరియల్ అందించే విధంగా తయారుచేయలేకపోవడమే. ఇంటర్వెల్ సమయానికి బలంగా బయటపడే కథను దర్శకుడు శరన్ కొప్పిశెట్టి సెకండాఫ్ మొత్తం అంతే బలంగా నడపడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రథమార్ధానికి మంచి స్క్రీన్ ప్లే అందించిన సుధీర్ వర్మ ద్వితీయార్థానికి ఆ స్థాయి కథనాన్ని ఇవ్వలేదు.

సెకండాఫ్లోని కీలకమైన సన్నివేశాలు చాలా వరకు రొటీన్ గానే అనిపిస్తాయి. కొన్నైతే చాలా బలహీనంగా కూడ ఉంటాయి. దీంతో చూసే ప్రేక్షకుల్లో కొంత నిరుత్సాహం ఆవరిస్తుంది. విరామ సమయానికి అసలు కథ ఓపెన్ అయినా ద్వితీయార్థంలో అదెక్కడా పెద్దగా కనిపించదు. కాలేజ్ ఎలక్షన్స్, గొడవలు అంటూ సినిమా సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. పోనీ ఆ అంశాలనైనా ఎఫెక్టివ్ గా చూపించారా అంటే పేలవమైన సన్నివేశాలతో అరకొరగా చూపించి వదిలేశారు.

దాంతో కథానాయకుడి పాత్ర యొక్క గమ్యం, వ్యక్తిత్వం ఏమిటనేది క్లారిటీగా తెరపై కనబడదు. ఇక ఇంటర్వెల్ ఉన్నంత బలంగా ముగింపు ఉండదు. చిన్న ఎమోషన్, ఒక ఫన్నీ సీన్ తో నార్మల్ గానే ముగిసిపోతుంది.

న‌టీన‌టుల ప‌నితీరు:
హీరో కృష్ణ క్యారెక్ట‌ర్‌ను స్ట్రాంగ్‌గా రాశారు. ఫ‌స్టాఫ్‌లో స‌ర‌దాగా ఉండే హీరో.. సెకండాఫ్‌లో సీరియ‌స్‌గా ఉండ‌టం.. గొడ‌వ‌లు ప‌డ‌టం.. చివ‌ర‌కు మార‌డం .. సినిమా అంతా హీరో చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర‌లో నిఖిల్ చ‌క్క‌గా న‌టించాడు. ముఖ్యంగా నార్మ‌ల్ లుక్‌, గ‌డ్డం ఉన్న లుక్‌లో నిఖిల్ మంచి వేరియేష‌న్ చూపించాడు. హీరోయిన్‌.. హీరోను ఓ బంగ్లాలోకి తీసుకెళ్ల‌డం… అక్క‌డ నుండి దెయ్యాల‌కు భ‌య‌ప‌డి పారిపోవ‌డం వంటి కొన్ని సీన్స్ సినిమా ల్యాగ్‌ను పెంచాయే కానీ.. మ‌రేం ఉప‌యోగం క‌న‌ప‌డ‌దు. అయితే సినిమా అంతా కాలేజీలోనే సాగ‌డం సినిమాకు ప్ర‌ధాన బ‌లం. కాబ‌ట్టి స్టూడెంట్స్ స‌హా ఓ మిడిల్ ఏజ్ గ్రూప్ ఆడియెన్స్‌కి వారి కాలేజీ రోజులు గుర్తుకు వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు. అలాగే ఇద్ద‌రు హీరోయిన్స్ సిమ్రాన్ పాత్ర సైలెంట్‌గా ఉంటే.. సంయుక్తా పాత్ర చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంటుంది. నిజానికి క‌న్న‌డ `కిర్రిక్ పార్టీ`లో చేసిన రోల్ కావ‌డంతో సంయుక్తా ఎక్క‌డా క‌ష్ట‌ప‌డలేదు. అదే జోష్‌, ఎనర్జీని ఈ సినిమాలో కూడా చూపించింది. సిజ్జు, రాకేందు మౌళి స‌హా మిగిలిన తారాగ‌ణం వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
నిర్మాణ సంస్థ‌: ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
 రేటింగ్ : 2.75/5
నటీన‌టులు: నిఖిల్‌, సిమ్రాన్ ప‌రింజ‌, సంయుక్తా హెగ్డే, రాకేందు మౌళి, వైవా రాఘ‌వ్‌, బ్ర‌హ్మాజీ, హ‌నుమంతే గౌడ త‌దిత‌రులు
సంగీతం: అజ‌నీశ్ లోక్‌నాథ్
సినిమాటోగ్ర‌ఫీ: అద్వైత గుర్తుమూర్తి
మాట‌లు: చ‌ందు మొండేటి
ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వ‌ర్మ‌
క‌ళ‌: అవినాశ్‌
స్క్రీన్ ప్లే: సుధీర్ వ‌ర్మ‌
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *