ధోని రికార్డును సమం చేసిన కోహ్లీ

విండీస్‌ టూర్‌లో టీమిండియా అదరగొడుతోంది. టీమిండియా-వెస్ట్టిండీస్‌ మధ్య జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సేన 318 పరుగుల తేడాతో నెగ్గింది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీ సేన 1-0తేడాతో ముందంజలో ఉంది. నిన్నటి మ్యాచ్‌ విజయంతో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన సారథిగా కోహ్లీ..ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ సారథిగా ఉన్నప్పుడు 27 టెస్టులను గెలిపించాడు. ఇక విదేశాల్లో అధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియాకు విదేశాల్లో ఇది 12వ విజయం. ఫలితంగా సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో 11 విజయాల రికార్డు బ్రేక్‌ అయింది. ఇక వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు ఈ టెస్టు విజయంతో ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌ను ఘనంగా ఆరంభించింది.

దీనిపై కోహ్లీ స్పందిస్తూ ‘కెప్టెన్సీ అనేది బాధ్యత. నేను దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. ఇలాంటి స్థాయిలో నేనో జట్టును నడిపిస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను. జట్టులో సమన్వయం లేకపోతే ఏదీ సాధ్యం కాదు. నేను సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని జట్టులోని ప్రతి ఒక్కరితోనూ పంచుకుంటాను. గ్రూప్‌ డిస్కషన్స్‌ పెట్టి మరీ జట్టుకు ఏది మంచిదో అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. జట్టులో అందరి సహకారం తీసుకుంటాను.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *