విరాట్ కోహ్లీ‌కి పద్మశ్రీ పురస్కారం… సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌కు కూడా..

న్యూఢిల్లీ: 2017 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించారు. పలు రంగాల్లో సేవలందించినందుకు గానూ ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. ఈసారి పద్మా అవార్డుల్లో పలువురు క్రీడాకారులకు చోటు దక్కింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ విరాట్ కోహ్లీకి పద్మశ్రీ ప్రదానం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఒలింపిక్స్‌లో చివరి వరకూ పోరాడిన క్రీడాకారులు దీపా కర్మాకర్‌, సాక్షిమాలిక్‌‌కు పద్మశ్రీ దక్కింది. ప్రముఖ నేపథ్య గాయని అనురాధ పౌడ్వాల్‌‌‌ను పద్మశ్రీ‌తో గౌరవిస్తున్నారు.

వీరితో పాటు కైలాష్‌ ఖేర్, సాధు మెహర్‌, నరేంద్ర కోహ్లీ, సంజయ్‌ కపూర్‌, టి.కె. విశ్వనాథన్‌, బి.సోమయ్య, వికాస్‌ గౌడ, శ్రీజేష్‌కు పద్మశ్రీ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మురళీ మనోహర్‌ జోషి, శరద్ పవార్, ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌, జేసుదాస్‌, పీఏ సంగ్మా‌లను పద్మ విభూషణ్‌‌తో సత్కరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒలింపిక్స్‌లో తన అద్భుత ఆటతీరుతో ఫైనల్ వరకూ పోరాడిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పేరు లేకపోవడంపై అభిమానులు అసంతృప్తి చెందారు.

2017- పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో మరికొందరు…

మీనాక్షి అమ్మ(కేరళ), చింతకింది మల్లేశం(తెలంగాణ), బిపిన్‌గణత్ర(బెంగాల్‌), దరిపల్లి రామయ్య(తెలంగాణ), డా. సునితీసాలమన్‌(తమిళనాడు), డా. సుబ్రతోదాస్‌(గుజరాత్‌), డా. భక్తియాదవ్‌(మధ్యప్రదేశ్‌), గిరీశ్‌ భరద్వాజ్‌(కర్ణాటక), అనురాధ కోయిరాల(నేపాల్‌), కరీముల్‌హక్‌(బెంగాల్‌), బల్‌బీర్‌ సింగ్‌(పంజాబ్‌), శేఖర్‌నాయక్‌(కర్ణాటక), అనంత్‌అగర్వాల్‌(యూఎస్‌ఏ), మరియప్పన్‌(తమిళనాడు), దీపాకర్మాకర్‌(త్రిపుర), సుక్రిబొమ్మగౌడ(కర్ణాటక), జితేంద్రహరిపాల్‌(ఒడిశా), ఎలిఅహ్మద్‌(అసోం), జనభాయ్‌దుర్గాభాయ్‌ పటేల్‌(గుజరాత్‌), మపుస్కార్‌(మహారాష్ట్ర).

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *