చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డితోనా, కోదండరామ్‌కు సిగ్గుండాలి: కెటిఆర్

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్న రేవంతతో కలిసి వేదిక పంచుకోవడానికి, జబ్బలు రాసుకొని తిరగడానికి తెలంగాణ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌కు సిగ్గుండాలని తెలంగాణ మంత్రి కెటి రామా రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై, ప్రాజెక్టులపై విమర్శల ద్వారా కోదండరామ్‌ తన స్థాయిని తగ్గించుకుంటున్నాని వ్యాఖ్యానించారు. నలబై ఏళ్లుగా పూర్తి కాని ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయని, అన్ని పనులూ ఏకకాలంలో చేపట్టి వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటే అర్థం చేసుకోకుండా కోదండరామ్‌ ప్రతిపక్షాలకు వంత పాడుతున్నారని కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్ల కోసం కాదా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెంటు వేస్తే ఆ వేదికను పంచుకుంటారా? విద్యావంతులు, మేధావులు చేయాల్సిన పనేనా ఇది? ములుగు జిల్లా కావాలని ఆందోళనలు చేస్తే అక్కడ పాల్గొంటారా? ఆచార్య జయశంకర్‌ పేరిట జిల్లా ఏర్పాటు చేశాం కదా? అని ప్రశ్నించారు.

ప్రగతి భవన్‌పైనా విమర్శలా…

ప్రగతి భవన్‌పైనా విమర్శలు చేస్తావా? అని కెటిఆర్ కోదండరామ్‌ను ప్రశ్నిస్తూ అది కేసీఆర్‌ సొంత ఆస్తి కాదని, ఎవరు ముఖ్యమంత్రి అయితే వారికే కదా అని అన్నారు. ప్రైవేటు కార్యక్రమాలు చేపడితే తప్పు పట్టాలి గానీ ప్రజల అవసరాల కోసం చేసే వాటిని కూడా తప్పుపడతావా? అని అడిగారు.

చంద్రబాబు మోకాలడ్డారు…

అత్యంత గందరగోళ పరిస్థితుల మధ్య నూతన రాష్ట్రాధికారాన్ని చేపట్టిన తాము రెండున్నరేళ్లలో పాలనను గాడిలో పెట్టామని, తెలంగాణ ఒక రాష్ట్రంగా మనుగడ సాగించలేదన్న విమర్శలు, అపోహలను పటాపంచలు చేశామని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా చంద్రబాబు అనేక విషయాల్లో మోకాలడ్డారని ఆయన అన్నారు. ఇలాంటి అనేక పరిస్థితులను అధిగమించి సుస్థిర అభివృద్ధి దిశగా సాగుతున్నామని అన్నారు. కేంద్రంతో సఖ్యతగా మెలిగి అనేక పథకాలను సాధించుకుంటున్నామని చెప్పారు.

కేంద్రం స్పందనపై కెటిఆర్ ఆసంతృప్తి

తాము కేంద్రంతో సఖ్యతతో మెలగడానికి ప్రయత్నిస్తున్నామని, తెలంగాణకు సాయం చేసే విషయంలో కేంద్రం స్పందన మిశ్రమంగానే ఉందని కెటిఆర్ చెప్పారు. హైకోర్టు విభ జన, ఉమ్మడి సంస్థల విభజన, ఐటీఐఆర్‌ విషయాల్లో సానుకూలంగా లేదని అన్నారు. జాతీయ రహదారుల మంజూరు, పరిశ్రమల స్థాపన వంటి విషయాల్లో బాగానే పని చేస్తోందని చెప్పారు.

ఐటి సంస్థలు, పరిశ్రమల కారణంగా…

పరిశ్రమలు, ఐటీ సంస్థల కారణంగా ప్రైవేటు రంగంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయని కెటిఆర్ చెప్పారు. ఈఓడీబీలో నెంబర్‌వన్‌ స్థానానికి చేరాం. ఆపిల్‌, గూగూల్‌, అమేజాన్‌, ఫేస్‌బుక్‌ వంటి ప్రపంచ అగ్రగామి సంస్థలు హైదరాబాద్‌లో సంస్థలను నెలకొల్పాయని అన్నారు. మిషన్‌ భగీరథ అప్పుల వల్ల సామాన్యులపై అదనంగా భారమేమీ ఉండదని చెప్పారు. పరిశ్రమల నీటికి వసూలు చేసే డబ్బుతోనే నిర్వహణ సాగిస్తాం. నీటి పారుదల ప్రాజెక్టులకు కూడా రుణాలు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

సిద్ధిపేట ప్రయోగం ఫలించిన తర్వాతే…

నగదు రహిత లావాదేవీల విషయమై ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గాన్ని పైలట్‌గా ఎంచుకున్నామని కెటిఆర్ చెప్పారు. అక్కడి ఫలితాలను విశ్లేషించుకుంటామని, తదనుగుణంగానే రాష్ట్రమంతటికీ విస్తరిస్తామని చెప్పారు. ప్రభుత్వం కమిటీని కూడా వేసిందని, త్వరలో టీ-వాలెట్‌ ప్రారంభిస్తున్నామని అన్నారు. అందరికీ బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంటుందని, రూపీ కార్డులు అందజేయాలని, ఇవన్నీ అమలు చేయడం కోసం స్మార్ట్‌ ఫోన్‌లపై డ్యూటీని తగ్గించాలని, పీఓఎస్‌ మిషన్‌లపైనా దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రాన్ని కోరామని అన్నారు.

ఓటర్ల దెబ్బకే చంద్రబాబు వెళ్లిపోయారు…

ఓటుకు నోటు కేసులో బెదిరించడం వల్లే చంద్రబాబు అమరావతికి వెళ్లారన్న ఆరోపణలో నిజం లేదని, రాజధాని కేంద్రంగా ఉన్న అమరావతికి వెళ్లి పరిపాలన చేయడమే చంద్రబాబుకు సమంజసమని కెటిఆర్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తగిలిన దెబ్బతో ఇక తప్పదన్నట్లు చంద్రబాబు ఇక్కడి నుంచి వె ళ్లిపోయారని అన్నారు. ఓటును కూడా తరలించుకున్నారని, అవశే షాలు మాత్రమే ఇక్కడ

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *