కోహ్లి, కుంబ్లే గొడ‌వ‌పై స్పందించిన‌ గంగూలీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనిల్ కుంబ్లే మ‌ధ్య గొడ‌వ‌పై తొలిసారి నోరు విప్పాడు క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ స‌భ్యుడు సౌర‌వ్ గంగూలీ. కుంబ్లేను గ‌తేడాది కోచ్‌ను చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన దాదా.. ఈ గొడ‌వ కార‌ణంగా కుంబ్లే రాజీనామా చేసినా అప్పుడు స్పందించ‌లేదు. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌ను డీల్ చేసిన విధానం స‌రిగా లేద‌ని గంగూలీ అభిప్రాయ‌ప‌డ్డాడు. మ‌రింత ప‌రిణ‌తితో వ్య‌వ‌హ‌రించాల్సింద‌ని అన్నాడు. ఈ విభేదాల‌ను ప‌రిష్క‌రించే బాధ్యులు ఎవ‌రైనా ఈ ఇష్యూని స‌రిగా డీల్ చేయ‌లేదు అని దాదా స్ప‌ష్టంచేశాడు. ఇప్పుడు కొత్త కోచ్ వేట‌లో మంగ‌ళవారం మ‌రో ట్విస్ట్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. గంగూలీకి అస్స‌లు ప‌డ‌ని ర‌విశాస్త్రి తాను కూడా ద‌ర‌ఖాస్తు చేసుకుంటాన‌ని చెప్పాడు. దీనిపైనా గంగూలీ స్పందించాడు. కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఎవ‌రికైనా హ‌క్కు ఉంది. నేను కూడా అప్లై చేసుకోవ‌చ్చు. అయితే అడ్మినిస్ట్రేట‌ర్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాలి అని గంగూలీ అన్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *