మీ చర్మం ఏ రకమో తెలుసుకోండి ఇలా…..

 ఉత్పత్తులు వాడేముందు మీ చర్మం ఏ రకమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ‘చర్మతత్వం తెలుసుకొని బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తే సరైన ఫలితం ఉంటుంది’ అంటున్నారు సౌందర్య నిపుణులు.

సాధారణ చర్మం: ఆయిలీగా, పొలుసులు లేచినట్టుగా ఉండడం సాధారణ చర్మం లక్షణం. ఈ రకం స్కిన్‌ ఉన్నవారిలో చర్మ సమస్యలు వచ్చే ముప్పు చాలా తక్కువ.
జిడ్డు చర్మం: జిగటగా, స్వేదగ్రంధులు అధికంగా, మెరుస్తూ ఉండడం ఈ రకం చర్మం ప్రత్యేకత. ఒత్తిడి, ఒంట్లో వేడి అధికంగా ఉండడం, వాతావరణం తేమగా ఉన్నప్పుడు వీరి చర్మం మరింత జిడ్డుగా మారుతుంది.
పొడిచర్మం: సాగదీసినట్టుగా, నిర్జీవంగా ఉంటుంది. ఎర్రటి మచ్చలు, చిన్నచిన్న రంధ్రాలు, చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పగుళ్లు, దురద పెట్టడం వంటివి డ్రై స్కిన్‌ లక్షణాలు.
కాంబినేషన్‌ చర్మం: మూడు చర్మాల (సాధారణ, జిడ్డు, పొడి చర్మం) లక్షణాలు ఈ స్కిన్‌లో చూడొచ్చు. జన్యుపరమైన లేదా హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా లిపిడ్ల సంఖ్య అమరిక అస్తవ్యస్తంగా ఉంటుంది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *