ఢిల్లీ లో ఎన్నికలని మద్యం దుకాణాలుబంద్

ఢిల్లీ ఎన్నికల సందర్బంగా అక్కడ వరుసగా కొన్ని రోజుల పాటు మద్యం దుకాణాలు  మూయనున్నారు.     ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తారన్న అనుమానంతో ఎన్నికల సంఘం  ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి 6 సాయంత్రం నుంచి ఢిల్లీలో ప్రచారం ముగియనున్నది. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 9న గురు రవిదాస్ జయంతి కారణంగా మద్యం దుకాణాలు మూసివేస్తారు.  ఫిబ్రవరి 10 మద్యం దుకాణాలు నియమిత సమయం వరకే తెరవనున్నారు. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపధ్యంలో ఆ రోజు మద్యం విక్రయాలు జరగవు.  కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ఎన్నికల సంఘం వివిధ ప్రాంతాలలో పలు కార్యక్రమాల్లో ఇదిఒకటి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *