అసెంబ్లీలో నోరూరించిన కేసీఆర్..

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఏ అంశంపై చర్చలో మాట్లాడిన ఆ అంశంపై పరిపూర్ణ అవగాహనతో చర్చించటంతో పాటు సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. గతంలో రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి సభ్యులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించిన సీఎం…తాజాగా మత్య పరిశ్రమ అభివృద్ధిపై జరిగన చర్చలో సభలో సభ్యుల నోరూరించారు.

గతంలో తెలంగాణ ప్రజలు ఎర్రరొయ్యలు తినేవారని…ఎస్సారెస్పీ దయవల్ల ఆపరిస్ధితి లేకుండా పోయిందన్నారు. చిన్నతనంలో తన అనుభవాలను సభకు గుర్తుచేసిన సీఎం…చిన్నప్పుడు అందరం రొయ్యలు తినేవాళ్లమని తెలిపారు.తెలంగాణలో రెండు రకాల రొయ్యలు దొరికేవని..కానీ ఇప్పుడు అక్వాకల్చర్ వైపు పరుగెడతున్నామని తెలిపారు.

ఒకటి గోదావరిలో దొరికే గంగ రొయ్యలు కాగా….మిగిలిన ప్రాంతంలో ఎర్ర రొయ్యలు దొరికేవని..దాంట్లో చింతచిగురు..శనగపప్పు వేసి వండితే బ్రహ్మాండమైన రుచి ఉండేదని సభలో నోరూరించారు సీఎం. ఆ టెస్టు ఎంతో అద్భుతంగా ఉంటుందని…నేను చిన్నప్పుడు తిన్నానని సభకు తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు ఎర్రరొయ్యలు దొరికే పరిస్ధితి లేదని….రానున్న కాలంలో తెలంగాణలో ప్రజలు ఎర్రరొయ్యలు తినే పరిస్ధితి వస్తుందన్నారు.

రాష్ట్రంలో 46 వేల 500 చెరువులు ఉన్నాయని….దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని చెరువులు లేవని తెలిపారు. ప్రస్తుతం నీటి నిల్వను దృష్టిలో ఉంచుకుని 3930 చెరువుల్లో చేప పిల్లలను పెంచుతున్నట్లు వెల్లడించారు. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చిందని…మత్యపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో రెండు ఫిషరీస్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణకు ఉన్న గొప్పవరమే మైనర్ ఇరిగేషన్ అని తెలిపారు.

చేపల విత్తన ఉత్పత్తి కేంద్రాలను రాష్ట్రమంతటా ప్రారంభిస్తామని తెలిపారు. బేస్త,ముదిరాజ్ అనే తేడా లేకుండా అందరికిప్రాధాన్యం కల్పిస్తామని…సోసైటీల పేరుతో అనవసర గొడవలకు పోవద్దన్నారు. రాష్ట్రంలో కొత్త సోసైటీలను ఏర్పాటుచేస్తమని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో 42వేల మంది మత్స్య కారులుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఫిషరీస్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి బేగంబజార్‌లో బ్రోకర్లను తరిమేస్తామని సభకు తెలిపారు. సైంటిఫిక్ పద్దతిలో చేపలను పెంచుతామన్న కేసీఆర్…రానున్న బడ్జెట్‌లో మత్య్స పరిశ్రమపై భారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఐదున్నర వేల కోట్ల చేపపిల్లలను పెంచే అవకాశం ఉందన్నారు. జురాల నుంచి పులిచింతల వరకు రిజర్వాయర్లలో చేపలు పెంచుతామని తెలిపారు.అవగాహన లోపంతో సోసైటీల మధ్య గొడవలు జరిగిన సందర్భాలున్నాయని తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పరిపుష్టమైన జీవిక ఉండాలన్నారు. అన్నివృత్తుల వారితో నేరుగా మాట్లాడేందుకు ప్రగతి భవన్లో జనహిత్ హాల్ ఏర్పాటుచేశామన్నారు.

సమైక్య రాష్ట్రంలో అన్నిరంగాలతో పాటు మత్యపరిశ్రమ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో మత్య్స పరిశ్రమ అంటే కొస్తాంధ్ర తీరమే అన్న భావన ఉండేదన్నారు. కానీ చిన్నతనంలో దుబ్బాకలో చదువుతున్నప్పుడు అప్పర్ మానేరు డ్యాం…చేప పిల్లల ఉత్పత్రి కేంద్రమని చెప్పేవారని గుర్తుచేశారు. కానీ తర్వాత కాలంలో తెలంగాణలో వందశాతం జీరో చేశారని మండిపడ్డారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *