సంచలనం సృష్టిస్తున్న గాంధీ మనవరాలు మేధా గాంధీ
ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ మనవరాలు మేధాగాంధీ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తుంది. గాంధీ విలువలకు విరుద్ధంగా ఆమె ధరించిన దుస్తువులపై పలువురు మండిపడుతున్నారు. భారత్ 71వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో మేధాగాంధీ ఇలాంటి దుస్తువులు ధరించడం ఏంటని గాంధేయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గాంధీ మరణం అనంతరం ఆయన గాంధీ పెద్ద కుమారుడైన హరిలాల్ గాంధీ కుమారుడు కాంతిలాల్ గాంధీ అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆయన కుమార్తే ఈ మేధా గాంధీ. వెస్ట్రన్ స్టైల్లో కనిపిస్తున్న మేధా డీజేగా తన సత్తాచాటుతుంది. అయితే ఆమె ఓ పార్టీలో తన స్నేహితులతో దిగిన కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటోలే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.