‘శివ’ లేనిదే ఒప్పుకోను: మహేష్ బాబు

మహేష్ బాబు, మురుగదాస్ కాంబో మూవీపై రోజురోజుకి అంచనాలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యే జీ-నెట్వర్క్ దీని శాటిలైట్ హక్కుల్ని 26 కోట్లకు గంపగుత్తగా కోనేసారన్న వార్త ఇప్పటికే టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దీనికొస్తున్న బిజినెస్ ఆఫర్స్ కి నిర్మాతలకు ఊపిరి ఆడటం లేదు. విడుదల ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ఇన్ని సంచలనాలు నమోదు అవుతుంటే త్వరలో విడుదల అయ్యే టీజర్ ఇంకెన్ని ప్రకంపనలు రేపుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తునారు ప్రిన్స్ ఫాన్స్. షూటింగ్ ఎక్కడా కూడా తడబాటు లేకుండా అనుకున్న టైంలో పక్కా ప్లానింగ్ ప్రకారం ల్యాగ్ లేకుండా కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్ లో నెలన్నర రోజుల పాటు జరిగే భారీ షెడ్యూల్ లో బిజీగా ఉంది యూనిట్. ఇది పూర్తయితే టాకీ పార్ట్ ఆల్మోస్ట్ అయినట్టే. తర్వాత పాటల చిత్రీకరణ మొదలు పెడతారు. ఇంటలిజెన్స్ వింగ్ ఆఫీసర్ గా కనిపించే మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో ఆడిపాడుతోంది. బడ్జెట్ పైకి చెప్పకపోయినా మహేష్ కెరీర్ లో ఇదే కాస్ట్లీ మూవీ అని తెలుస్తోంది. అటు తమిళ్ లో కూడా మురుగదాస్ మూవీ కాబట్టి డబ్బింగ్ వెర్షన్ కు ఫాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి.

ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం చాలా కసరత్తు చేస్తోంది మూవీ యూనిట్. చాలా పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ‘అభిమన్యు’, ‘ఏజెంట్ శివ’ అనే రెండు పేర్ల దగ్గరే లాక్ అయిపోయారు హీరో, దర్శకుడు. అభిమన్యు అనే పేరుతో కళ్యాణ్ రామ్ హీరోగా గతంలో ఓ సినిమా వచ్చింది. ఫ్లాప్ కూడా అయ్యింది. మరి అది పెట్టడం అనుమానమే. మహేష్ మాత్రం ఏజెంట్ శివ వైపే మొగ్గు చూపుతుండగా అదే టైటిల్ తమిళ్ వెర్షన్ కు పెడితే టైటిల్ లో ఏజెంట్ ఇంగ్లీష్ పదం కాబట్టి టాక్స్ మినహాయింపు రాదు. అదో సమస్య. కాని శివ అని ఉండి తీరాల్సిందే అని మహేష్ పట్టు. పోనీ సింపుల్ గా శివ అని పెడదామంటే నాగార్జున కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిన మూవీ పేరు కాబట్టి అంత సౌండింగ్ ఉండదేమో అని డౌట్ పడుతున్నారు. మరి ఏది ఫైనల్ చేస్తారో అని యమ టెన్షన్ గా ఉంది మహేష్ ఫాన్స్ కి. మహేష మాత్రం రెండు కండీషన్స్ పెట్టాడు. ఒకటి టైటిల్ లో శివ ఉండటం. రెండు తమిళ్, తెలుగు వెర్షన్స్ కు కామన్ టైటిల్ ఉండటం. ఇక ఏది పెడతారో మీ ఊహకే వదిలేస్తున్నాం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *