న్యూ ఇయ‌ర్ సంబరాల కోసం మహేష్ బాబు

మరో రెండు మూడు రోజుల్లోనే  అంతా న్యూ ఇయర్ మూడ్‌లోకి వచ్చేస్తారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పార్టీలు చేసుకోవాలా అంటూ ప్లాన్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ ఎవ‌రంటే మ‌రో ఆలోచ‌న లేకుండా మ‌హేష్ బాబు అని చెప్పాలి. ఎందుకంటే ఈయ‌న‌కు ఏ మాత్రం షూటింగ్‌లో టైమ్ దొరికినా వెంట‌నే కుటుంబాన్ని తీసుకుని విదేశాల‌కు వెళ్లిపోతాడు. దొర‌క్క‌పోయినా దొరికించుకుని మ‌రీ వెళ్తుంటాడు. అయితే మహర్షి సినిమా తర్వాత మాత్రం ఈయనకు టైమ్ దొరకలేదు. అప్పుడు 15 రోజులు ఎంజాయ్ చేసొచ్చిన ఈయన.. తర్వాత సరిలేరు నీకెవ్వరుతో బిజీ అయిపోయాడు. ఈ చిత్రాన్ని కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసాడు సూపర్ స్టార్. దాంతో మధ్యలో అస్సలు టైమ్ దొరకలేదు. ఇక ఇప్పుడు న్యూ ఇయ‌ర్ సంబరాల కోసం మరోసారి ఫారెన్ వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడే కొత్త ఏడాదికి కుటుంబంతో కలిసి వెల్‌కమ్ చెప్పాలనుకుంటున్నాడు మహేష్ బాబు. త‌న పిల్ల‌ల‌తో క‌లిస్తే మహేష్ కూడా పూర్తిగా పిల్లాడైపోతాడు. ఇప్పుడు కూడా ఇలాగే ప్లాన్ చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. న్యూ ఇయర్ కోసం యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆయనతో పాటు బావ గల్లా జయదేవ్ కుటుంబం కూడా వెళ్తుందని ప్రచారం జరుగుతుంది. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పూర్తి కావడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండటంతో ఈయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోబోతున్నాడు. న్యూ ఇయ‌ర్ సంబ‌రాలు ముగించుకుని ఇండియాకు రానున్నాడు మహేష్ బాబు. జనవరి తొలివారంలో మళ్లీ సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్ కోసం టైమ్ కేటాయిస్తాడు. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. చిరంజీవి దీనికి ముఖ్య అతిథి. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల కానుంది. మొత్తానికి న్యూ ఇయర్ కోసం ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఈయన.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *