మహేష్ కొత్త మూవీ స్టిల్స్ మళ్ళీ లీకయ్యాయి…

మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్లో దాదాపు 70-80 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు , తమిళం లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. 90 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ని జనవరి చివరి వారం వరకు పూర్తి చేసి సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని మురుగదాస్ భావిస్తున్నాడు. కాగా షూటింగ్ ను కూడా అదే స్థాయిలో స్పీడ్ గా కానిస్తున్నాడు.. ఈ చిత్రానికి ఇదే టైటిల్ అంటూ రకరకాల టైటిల్స్ ప్రచారం జరుగుతూ వస్తూనే ఉన్నాయి. తాజాగా ‘ఏజెంట్ శివ” అనే టైటిల్‌ ప్రచారంలోకి వచ్చి హల్‌చల్ చేస్తోంది.ఈ చిత్రం లో మహేష్ బాబు ఐబీ అధికారిగా కనిపిస్తుండడం , అలాగే శివ అనే రోల్ పోషిస్తుండడం తో ఈ సినిమాకు ‘ఏజెంట్ శివ” అని పెట్టారని వినిపిస్తుంది. మరి ఈ టైటిల్ అయినా ఒకే చేస్తారో లేదు చూడాలి.

ముంబై నేపథ్యంలో: తెలుగు.. తమిళ భాషలలో ఈ సినిమాను తెరకెక్కించి, హిందీలోను విడుదల చేయాలనే ఆలోచనలో మురుగదాస్ ఉన్నాడు. కథ పూర్తిగా ముంబై నేపథ్యంలో కొనసాగుతుంది. న్యాయ వ్యవస్థపై హీరో ఉక్కుపాదం మోపే విధంగా ఈ సినిమా స్టోరీ లైన్ ఉంటుందని దర్శకుడు మురుగదాస్ తెలిపారు. ఈ మూవీకి వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. తాజాగా ‘ఏజెంట్ శివ’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది.

జీటీవీ వారు భారీ డీల్: ఈ సినిమాకు సంబంధించి జీటీవీ వారు భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ 26 కోట్ల రూపాయలనే ప్రచారం జరుగుతోది. ఇందులో 21 కోట్లు తెలుగు, తమిళం శాటిలైట్ రైట్స్ కు కాగా ఐదు కోట్లు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద తీసుకున్నట్లు టాక్.’ఏజెంట్ శివ’ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్  తెలుగు, త‌మిళ్ లో దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ సీన్స్ ను ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చిత్రీక‌రిస్తున్నారు.ఈ మధ్య తెలుగులో సినిమా మేకింగ్ వీడియోలను, టీజర్లను వర్చువల్ రిలీజ్ చేసే ట్రెండ్ మొదలైంది. మహేష్-మురగదాస్ కాంబినేషన్ మూవీ టీజర్ కూడా ఈ వర్చ్యువల్ రియాల్టీ టెక్నాలజీ లో విడుదల చేయడానికి వర్క్ స్టార్ట్ అయిందట.

mahesh-babu-s-look-ar-murugadoss-film-leaked-online
mahesh-babu-s-look-ar-murugadoss-film-leaked-online

ఫోటోలు లీక్ అయ్యాయి: ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. ఇంకా తాము ఫస్ట్ లుక్ ఇవ్వకుండానే.. పటిష్టమైన చర్యలకు కేంద్రం సిద్ధమని.. చెప్పిన దర్శకుడు మురుగదాస్ అక్కడి నుంచి కాసింత సెక్యూరిటీ పెంచేశాడు.ఇప్పుడు సడెన్ గా మహేష్ బాబు కొత్త స్టిల్స్ నెట్ లో దర్శనమిచ్చేశాయి. ఒకటీ అరా కాదు.. ఓ నాలుగైదు ఫొటోలునెట్లో వచ్చి పడ్దాయి.

మహేష్ బాబు బస్ లోంచి దిగి వచ్చి.. అక్కడ ఉన్న వారందిరినీ విష్ చేసి వెళ్లిపోవడం కనిపిస్తుంది. మురుగదాస్ సినిమాలో మహేష్ లుక్ ఇప్పటికే తెలిసిపోయినా.. ఈ సారి మరింత స్మార్ట్ గా కనిపిస్తున్నాడు సూపర్ స్టార్. హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ట్రైచేశాడు. క్లాస్ గా కనిపిస్తున్నా.. మాస్ ను ఒప్పించేందుకు తగినంతగా కష్టపడ్డ దర్శకుడు మహేష్ గెటప్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకున్నాడనే సంగతి అర్ధమవుతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *