సర్ ప్రైజ్ సిద్ధం చేస్తున్న మహేష్

టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ  సినిమాకు సంబంధించిన మహేష్ ఓ సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తున్నాడట‌.

ఈ నెల 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఓ మైక్రో టీజర్‌తో పాటు మహేష్‌ లుక్‌ను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నరు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *