కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న మహేశ్ బాబు

mahesh అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఇటీవల గచ్చిబౌలిలో విలాసవంతమైన ‘ఏఎమ్‌బీ’ సినిమాస్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆయన త్వరలో సొంతంగా దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘మిమ్మల్ని ఉత్సుకతకు గురి చేసే విషయాన్ని పంచుకుంటున్నాం. ప్రస్తుతం మేం దీని పనిలోనే ఉన్నాం. సీక్రెట్‌ను బయటపెట్టేందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి’ అంటూ http://www.spoyl.in/mahesh-babu అనే వెబ్‌సైట్‌ను మహేశ్‌ బృందం పోస్ట్‌ చేసింది. దీన్ని మహేశ్‌ తిరిగి షేర్‌ చేశారు. ఇందులో మూడు రోజులు కౌంట్‌డౌన్‌ ఉంచారు. ఈ పేజ్‌లో కింది భాగంలో దుస్తుల రకాలు, బ్రాండ్‌లు ఉంచారు. దీన్ని బట్టి మరో మూడు రోజుల్లో ఈ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎలాంటివి విక్రయానికి ఉంచుతారో చూడాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టాలీవుడ్‌లో ఇప్పటికే యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ‘రౌడీ’ పేరుతో సొంత దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు. బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌, సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ, దీపికా పదుకొణె, సన్నీ లియోని తదితరులు సొంతంగా దుస్తులు, యాక్సెసెరీస్ బ్రాండ్లను నడుపుతున్నారు.

 

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *