మహేష్ బాబు సినిమా పేరు ” భరత్ అను నేను “..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో రాజకీయ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మాణంలో కొరటాల శివ తీయబోయే ఆ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మాట అటుంచితే, మహేష్, కొరటాల సినిమాను నిర్మిస్తున్న డివివి దానయ్య తాజాగా భరత్ అను నేను అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. ఇది మహేష్ సినిమా కోసమే అంటూ ఫిల్మ్ నగర్ కన్ఫామ్ చేసేస్తోంది. భరత్ అను నేను అంటూ ప్రమాణ స్వీకారం టైమ్‌లో చెప్పే మహేష్ చెప్పే మాట మీదే సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేశారట.

ఇక ఈ సినిమాకు ముందుగా అనుకున్నట్టుగా కాకుండా, షూటింగ్ లేటుగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మురుగదాస్ సినిమా షెడ్యూల్స్ లేట్ అయిపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవాలి కానీ అలా జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికి మురుగదాస్ సినిమా 65 శాతం మాత్రమే పూర్తికాగా ప్రస్తుతం అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా పూర్తి కావాలంటే జనవరి దాటుతుందట. దాంతో కొరటాల శివ తో చేసే సినిమా ఆలస్యం అవుతుందని డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి. శ్రీమంతుడు కాంబో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పేలా లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *