ఆగిపోయిన సినిమా గురించి మాట్లాడిన మహేష్

ప్రతి హీరో కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉంటాయి. సెట్స్ పైకి రాకముందే అవి అటకెక్కేస్తాయి. మహేష్ కెరీర్ లో కూడా అలాంటిదే ఓ సినిమా ఉంది. అది కూడా అలాంటిలాంటి మూవీ కాదు. ఏకంగా మణిరత్నం దర్శకత్వంలో చేయాల్సిన హిస్టారికల్ మూవీ. అదే పొన్నియన్ సెల్వన్.

తమిళ మ్యాగజైన్ వికటన్ కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఈ హిస్టారికల్ మూవీ గురించి మహేష్ మాట్లాడాడు. నిజానికి ఈ సినిమాతోనే తమిళ ఎంట్రీ ఇద్దామనుకున్నాడు మహేష్. దాదాపు ఆరేళ్ల కిందటే సెట్స్ పైకి రావాల్సిన సినిమా ఇది. మహేష్, విజయ్ హీరోలుగా ఈ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేశాడు దర్శకుడు మణిరత్నం. అయితే సోలోగా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతో పాటు, మరికొన్ని ఇతరత్రా కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయినట్టు మహేష్ తెలిపాడు.

కెరీర్ లో ఇప్పటివరకు హిస్టారికల్ బేస్డ్ మూవీ చేయలేదు మహేష్. పొన్నియన్ సెల్వన్ సినిమాను రిజెక్ట్ చేయడంతో పాటు.. రుద్రమదేవి సినిమాలో బన్నీ చేసిన గోన గన్నారెడ్డి పాత్రను కూడా తిరస్కరించాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *