ట్రంప్ కు ఒబామా థ్యాంక్స్ చెప్పాల్సిందే

పోయినోళ్లే మంచోళ్లు అని  అనుకుంటుంటారు. ట్రంప్ లాంటి తింగరిమేళం పవర్ లోకి వస్తే ఇలాంటి ఫీలింగ్స్ మరింత ఎక్కువగా అనిపించటం ఖాయం. ఇప్పుడు అదే ఫీలింగ్ లో ఉన్నారు.. అమెరికన్లు. అమెరికా అధ్యక్ష పదవిలోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు.. తన మాటలతో.. చేతలతో నిత్యం ఏదో ఒక కలకలం రేపుతున్న ట్రంప్ తీరుపై మెజార్టీ అమెరికన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టి.. నిండా మూడు వారాలు కూడా నిండని వేళ.. ఆయన వెళ్లిపోతే బాగుండనే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటం గమనార్హం. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి.. రిటైర్ అయిన ఒబామాను మళ్లీఅధ్యక్ష స్థానంలో చూడాలని భావిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందన్న విషయం తాజాగా జరిపిన ఒక అధ్యయనం చెప్పింది.

పబ్లిక్ పాలసీ పోలింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉండటాన్ని 43 శాతం మంది అమెరికన్లు మాత్రమే సంతోషాన్నిస్తోందట. 52 శాతం అమెరికన్లు.. ఒబామాను మళ్లీ అధ్యక్షుడిగా చూడాలని భావిస్తున్నారట. వలసలపై ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వుల్ని సైతం మెజార్టీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్న విషయం తేలిపోయింది. 49 శాతం మంది ట్రంప్ పాలసీని వ్యతిరేకించగా.. ట్రంప్ విధానాలకు మద్దతు ఇస్తున్న వారు 43 శాతమ మంది మాత్రమేనని చెబుతున్నారు. మొత్తంగా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన ఒబామాను.. అమెరికన్లు పదే పదే గుర్తు కు తెచ్చుకోవటం గమనార్హం. ఎంతోమంది అధ్యక్షులు దిగిపోయిన తర్వాత.. కొత్త అధ్యక్షుల వారి మీద ఆశలు అంతకంతకూపెరుగుతుంటాయి. ట్రంప్ పుణ్యమా అని ఒబామాను గుర్తుకు తెచ్చుకుంటున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా తన క్రేజ్ నుఅంతకంతకూ పెరిగేలా చేస్తున్న ట్రంప్ కు ఒబామా థ్యాంక్స్ చెప్పాలేమో..?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *