కొడుకు రేప్ చేస్తే…తల్లి వీడియో తీసింది…

యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి కొడుకు అత్యాచారం చేస్తే.. ఆ తతంగాన్నంతా అతడి తల్లి వీడియో తీసి బాధితురాలి నుంచి ఏకంగా రూ.4లక్షల కొట్టేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే బలోడా బజార్ జిల్లా కేంద్రానికి ఓ యువకుడు స్థానికంగా నివసించే ఓ యువతితో స్నేహం చేసి ప్రేమలోకి దించాడు. కొద్దిరోజుల క్రితం ఆ యువకుడు తన ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెను అతడి తల్లి సాదరంగా ఆహ్వానించి స్నాక్స్ తినిపించింది.

అవి తిన్న కాసేపటికే యువతిని నిద్రలోకి జారుకుంది. మత్తులో ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తల్లి కొడుకును ఎంకరేజ్ చేస్తూ ఆ ఘటన అంతా వీడియో తీసింది. కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చిన బాధితురాలని ‘నిన్ను నా కొడుకు రేప్ చేశాడు. దాన్నంతా నేను వీడియో తీశాను. నేను అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోను బయటపెట్టి నీ పరువు తీస్తా’ అని తల్లి బాధితురాలిని బెదిరించింది. దీనితో తన తండ్రి పొలం అమ్మిన రూ.6లక్షల్లో రూ.4లక్షలు సమర్పించుకుంది. ఆమె తండ్రి రూ.6లక్షలు ఇవ్వాలని కూతురిని అడగ్గా రూ.2లక్షలే ఇచ్చింది. మిగిలిన డబ్బులు ఏమయ్యాయని అతడు అడగడంతో తనకు జరిగిన అఘాయిత్యం గురించి చెప్పి బోరుమంది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తల్లీకొడుకును అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *