వీటికే నో చెప్పా… లిప్‌లాక్‌లకు ఎలా ఒప్పుకుంటాను: మంజీమా

వర్ధమాన నటీమణుల్లో మంజిమా మోహన్ ఒకరు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగచైతన్యతో జతకట్టిన మంజిమ త్వరలోనే మరో తెలుగు సినిమాలో కనిపిస్తానని చెప్పింది. ఈ మధ్యనే లిప్ లాక్‌కి కూడా సిద్ధమని ప్రకటన ఇచ్చింది. దీనిపై వివాదం చెలరేగడంతో వివరణ ఇచ్చింది.

సాధారణంగా గ్లామర్‌కు అశ్లీలానికి సన్నని తెర ఉందని చెప్పింది. కానీ, తాను ఒకటి చెబితే, మీడియాలో మరొకటి వచ్చిందని తెలిపింది. సినిమా ప్రేక్షకుల అభిరుచుల్లో తేడా వచ్చిందని పేర్కొంది. ప్రేక్షకులు గ్లామర్, అశ్లీలానికి మధ్య తేడాను గుర్తిస్తారని చెప్పింది.

 గ్లామర్ పేరుతో చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తాను లిప్ లాక్‌ను ఎలా అంగీకరిస్తానని తిరిగి ప్రశ్నించింది. సినిమా అవకాశాలు లేకపోతే ఇంట్లో కూర్చుంటానే తప్ప కుటుంబం మొత్తం చూడలేని సినిమాలు చేయలేనని స్పష్టం చేసింది. అలా అని తాను గ్లామర్ పాత్రలను అంగీకరించనని కాదని, గ్లామర్ వేరు అశ్లీలం వేరు అని చెప్పింది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *