మెగా స్టార్స్ వీరా భిమాని మృతి

మెగా స్టార్స్ వీరా భిమాని….

మెగాస్టార్‌ చిరంజీవి  ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నూర్‌ మహ్మద్‌(55) ఆదివారం గుండెపొటుతో మృతి చెందారు.   శనివారం రాత్రి మహ్మద్‌ ముషీరాబాద్‌ స్పెన్సర్‌ ఎదురుగా ఉన్న ఓ దర్గాలో నిద్రించాడు. గుండెపోటు రావడంతో నూర్‌ మహ్మద్‌ నిద్రలోనే కన్నుమూసినట్లు  తెల్లవారుజామున దర్గా నిర్వాహకులు లేపేందుకు ప్రయత్నించగా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మోండా మార్కెట్‌లో తమల పాకుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న నూర్‌ మహ్మద్‌ చిరంజీవికి వీరాభిమాని చిరంజీవి కుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నూర్‌ మహ్మద్‌ మరణవార్త తెలియగానే చిరంజీవి, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో న్యూబోయిగూడలోని ఆయన ఇంటికి తరలి  వచ్చి నూర్‌ మహ్మద్‌ భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. చిరంజీవి, అల్లు అర్జున్‌ను చూడగానే  నూర్‌ మహ్మద్‌ భార్య పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. చిరంజీవి వారిని ఓదార్చి  ధైర్యం చెప్పారు. నూర్‌ మహ్మద్‌ అంత్యక్రియలకు చిరంజీవి ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిసింది..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *