ఎంజీబీఎస్‌లో మారిన ప్లాట్‌ఫారం వివరాలివే..

తెలంగాణ ఆర్టీసీకి మణిహారంగా ఉన్న మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో అధికారులు ఇటీవల కొత్త మార్పులు చేశారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ నగరాలకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వెళ్లే బస్సుల ప్లాట్‌ఫారంలను మార్చారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు ఎక్కడెక్కడ ఏయే బస్సులు ఆగుతాయనే అంశంపై ప్లాట్‌ఫారం నంబర్లు, ఆగే బస్సుల వివరాలతో కూడిన ఓ జాబితాను విడుదల చేశారు.

1 నుంచి 5 ప్లాట్‌ఫారం వరకు: గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల, అమ‌రావ‌తి, ఐరావత్‌ బస్సులన్నీ నిలపనున్నారు.
* 6 నుంచి 7 వరకు: బెంగళూరు వెళ్లే టీఎస్‌ఆర్టీసీ బస్సులు
* 8వ ప్లాట్‌ఫారం: బెంగళూరు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులు
* 9వ ప్లాట్‌ఫారం: అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు
* 10 నుంచి 11 వరకు: ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు
* 12వ ప్లాట్‌ఫారం: సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు
* 13వ ప్లాట్‌ఫారం: కుంట, బైలాదిల్లా, జగదల్‌పూర్‌ బస్సులు
* 14 నుంచి 15 వరకు: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు
* 16 నుంచి 17 వరకు: గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు
* 18 నుంచి 22 వరకు: యాదగిరిగుట్ట, వరంగల్‌
* 23వ ప్లాట్‌ఫారం: శ్రీశైలం వెళ్లే బస్సులు
* 24 నుంచి 25 వరకు: అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు
* 36వ ప్లాట్‌ఫారం: రాయ్‌చూర్‌ బస్సులు
* 27 నుంచి 31 వరకు: మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ
* 32 నుంచి 34 వరకు: నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌, షాద్‌నగర్‌
* 35 నుంచి 36 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 37 నుంచి 38 వరకు: విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 39వ ప్లాట్‌ఫారం: విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 40వ ప్లాట్‌ఫారం : విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 41 నుంచి 42 వరకు: గద్వాల్‌, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 43 నుంచి 45 వరకు: కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 46 నుంచి 47 వరకు: మెదక్‌, బాన్సువాడ, బోధన్‌ వెళ్లే బస్సులు
* 48 నుంచి 52 వరకు: జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కరాడ్‌, షోలాపూర్‌, పుణె, ముంబయి, (టీఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ) బస్సులు
* 53 నుంచి 55 వరకు : సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్‌, మంచిర్యాల, అసీఫాబాద్‌ బస్సులు
* 56 నుంచి 58 వరకు: నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నాగ్‌పూర్‌, అమరావతి బస్సులు
* 59 నుంచి 61 వరకు: మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు
* 62వ ప్లాట్‌ఫారం: దేవరకొండ
* 63 నుంచి 65 వరకు: పరిగి, వికారాబాద్‌, తాండూరు బస్సులు
* 66 నుంచి 75 వరకు: ఎలైటింగ్‌ పాయింట్లు
* 76 నుంచి 79 వరకు: సిటీ సర్వీస్‌ బస్సులు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *