అభినందన్ ఎఫ్-16 విమానాన్ని కూల్చడం చూశాను

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16ను కూల్చివేయడం తాను చూసినట్లు స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌ తెలిపారు. అభినందన్‌ వర్ధమాన్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చేయడం నా స్క్రీన్‌ నుంచి చూశాను. ఆ సమయంలో ఆయనకు వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాను. బాలాకోట్‌ స్థావరాలపై విజయవంతంగా దాడులు జరిపాం. శత్రువులను నుంచి ప్రతిస్పందన వస్తుందేమోనని భావించాం. అందుకు మేం సిద్ధంగా కూడా ఉన్నాం. అపాయం తలపెట్టే దురుద్దేశంతోనే పాక్‌ విమానం భారత గగన తలంలోకి ప్రవేశించింది. కానీ అప్పటికే మన పైలెట్లు, కంట్రోలర్లు, ఇతర బృందం నుంచి గట్టిపోటీ ఎదురయ్యే సరికి వారి మిషన్‌ విఫలమైంది’ అని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మింటీకి ‘యుద్ధ్‌ సేవా పతకం’ను కేంద్రం ప్రకటించింది. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డు పొందనున్న తొలిమహిళ రక్షణ అధికారి మింటీనే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *