ఆలేరు ఎమ్మెల్యే సునీతకు ప్రమాదం తప్పింది

: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెనుప్రమాదం తప్పింది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పంచాయతీరాజ్‌ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులతో భేటీ తర్వాత లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడానికి సునీత సిద్ధమయ్యారు. ఆ సమయంలో సీలింగ్‌ పైకప్పు పెచ్చులు ఊడి అక్కడే ఉన్న గ్లాస్‌ టేబుల్‌పై పెచ్చులు పడటంతో టేబుల్‌ విరిగి గ్లాస్‌ ముక్కలు తగలడంతో ఆమె మోకాళ్లు, చేతి వేలికి గాయమైంది. సునీత పక్కనే ఉన్న ఆలేరు మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఇందిర, గొలనుకొండ సర్పంచ్‌ లక్ష్మి తలలకు గాయాలయ్యాయి. వారి ని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *