కీరవాణిని ఫుట్ బాల్ ఆడుతున్నారు

రిటైర్ కావాలి అని డిసైడ్ అయినప్పుడు దాన్ని వీలైనంత ప్రశాంతంగా గౌరవప్రదంగా చేసుకుంటే తర్వాత గడిపే రోజులు హాయిగా ఉంటాయి. అలా కాకుండా ఏదో ఒక వివాదాన్ని తలకు రాసుకుంటే అది పోగొట్టుకోవడానికి జుట్టునే వదులుకునే పరిస్థితి రావొచ్చు. ఇప్పుడు సంగీత దిగ్గజం కీరవాణి పరిస్థితి అలాగే ఉంది. ఈ మధ్య బాహుబలి 2 ఆడియో రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా కీరవాణి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడొస్తున్న సంగీతం గురించి ముఖ్యంగా గీత రచయితలు దర్శకుల గురించి కీరవాణి చేసిన కామెంట్స్ అధిక శాతం ఇండస్ట్రీ వర్గాలకు విపరీతమైన కోపం తెప్పించాయి. కొందరు బహిరంగంగానే తమ అభిప్రాయం చెప్పేస్తే ఇంకోదరు మాత్రం టైం చూసి రిటార్ట్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నారు. ట్విట్టర్ సాక్షిగా జరిగిన ఈ వ్యవహారం గురించి రాజమౌళి సైతం ఏమి మాట్లాడలేక మౌనాన్నే ఆశ్రయించాడు. కీరవాణి చేసిన కామెంట్స్ లో ఆయన ప్రధానంగా విమర్శించింది దిగజారుతున్న సాహిత్యం గురించి ప్లస్ టాలీవుడ్ సినిమాల మ్యూజిక్ మరీ తీసికట్టుగా ఉండటం గురించి.

సరిగ్గా ఈ పాయింట్ ని పట్టుకుని కొందరు నెటిజెన్లు, జర్నలిస్ట్ లు తమ పరిశోదనకు బుర్రకు పదును పెట్టి కీరవాణి గతంలో కంపోజ్ చేసిన బూతు పాటలను వెతికి మరీ నెట్ లో పెడుతూ ఆయన పరువును గాలి తీసినట్టు తీసి పడేస్తున్నారు. తనకు ఎంతో ఇష్టుడు గొప్ప దర్శకుడు అని కితాబు ఇచ్చిన రాజమౌళి తో కలిసి పని చేసిన సినిమాల్లోని బూతు పాటలనే పల్లవి చరణాలతో సహా చూపించి ఎండగడుతున్నారు. విక్రమార్కుడు, స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ, చత్రపతి, సింహాద్రి లాంటి కీరవాణి రాజమౌళి కాంబో లో వచ్చిన పాటలనే ఉదాహరణ గా చూపుతున్నారు. విలువలు పాటించడం నిజమైతే రాజమౌళి సినిమాల్లోనే ఇలాంటి పాటలు రాకుండా చూసుకోవాల్సింది అని క్లాసు పీకుతున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. కీరవాణి ఇప్పుడు కాదు పాతికేళ్ళ క్రితమే అల్లరి అల్లుడు, అల్లరి మొగుడు లాంటి సినిమాల్లో తన గురువు గా భావించే రాఘవేంద్ర రావు గారితోనే ఇలాంటి పాటలకు వర్క్ చేసారు. అలాంటిది తను మాత్రమే చేయలేదు అందరు చేసారు అని చెప్పడం భావ్యం కాదు అనేది వాళ్ళ వెర్షన్. కీరవాణి వీటికి చెక్ పెడితే బెటర్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *