యాద్రాద్రికి ఎం.ఎం.టి.ఎస్

సికింద్రాబాద్-చర్లపల్లి మద్య ఎం.ఎం.టి.ఎస్. రెండో దశ పనులను పరిశీలించడానికి నిన్న దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ వచ్చారు. ఆ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ “యదాద్రి వరకు ఎం.ఎం.టి.ఎస్.పొడిగించడానికి అన్ని అనుమతులు మంజూరు అయ్యాయని తెలిపారు. సికింద్రాబాద్-యాదాద్రి ఎం.ఎం.టి.ఎస్. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.330 కోట్లు వ్యయం అవుతుందని దానిలో రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం 1/3:2/3 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయని తెలిపారు. ఏప్రిల్ నెలలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలుస్తామని, అవి ఖరారు కాగానే పనులు మొదలుపెడతామని చెప్పారు.

చర్లపల్లిలో రూ.80కోట్లు వ్యయంతో నూతన టెర్మినల్ నిర్మించబోతున్నట్లు చెప్పారు. కొత్తగా ఆరు ప్లాట్ ఫారంలను కూడా నిర్మించబోతున్నట్లు వినోద్ కుమార్ చెప్పారు. చర్లపల్లిలో రైల్వే టెర్మినల్ భావన నిర్మాణం కోసం తమ వద్ద 50 ఎకరాలు సిద్దంగా ఉందని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 150 ఎకరాలను ఈయవలసిందిగా కోరినట్లు తెలిపారు. చర్లపల్లిలో ఎం.ఎం.టి.ఎస్. రెండో దశ పనులను ఈ ఏడాది డిశంబర్ నెలలోగా పూర్తి చేస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో వచ్చినప్పటి నుంచే యాద్రాది అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానికి ఏటా బడ్జెట్ లో బారీగా నిధులు కూడా కేటాయిస్తుండటంతో యాదాద్రి ఆలయం కొత్త శోభ సంతరించుకొంది. దానితో భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల ప్రజలతో బాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం చాల మంది భక్తులు యదాద్రికి వస్తున్నారు. కనుక యదాద్రికి  ఎం.ఎం.టి.ఎస్. రైల్వే లైన్ పొడిగించినట్లయితే భక్తులకు చాలా సౌకర్యంగా  ఉంటుంది కనుక వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *