దుమ్మురేపుతున్న మోటో ఈ4 సేల్స్

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో ఈ4 ను  జులై 12న మార్కెట్ లోకి ప్లస్‌ను విడుదల చేసింది. రూ.8,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈఫోన్ విక్రయించగా.. కేవలం ఒక్క రోజులోనే లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయని కంపెనీ ప్రకటించింది. విడుదలైన మొదటి గంటలో నిమిషానికి దాదాపుగా 580 ఫోన్ల అమ్మకం జరిగిందని ఈ ప్రకటనలో తెలిపింది.

5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్, వాటర్ రీపెల్లెంట్ కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *