ఇక నుంచి ఒకే వస్తువుపై రెండు ధరలుండవు!

ఒకే వస్తువుపై రెండు ముద్రించి జనాలను దోచుకునే వారిపై ఇక నుంచి కేంద్రం కొరడా ఝలిపించనుంది. ప్రస్తుతం బయట రూ. 20కి లభించే వాటర్ బాటిల్‌ మల్టీప్లెక్సుల్లో రూ. 50, విమానాల్లో రూ. 100 వరకూ విక్రయిస్తున్నారు. రూ.10 లభించే చిప్స్ ప్యాకెట్ ధర ఎయిర్ పోర్టులో రూ. 50 వసూలు చేస్తారు. ఇలా గరిష్ఠ చిల్లర ధరల విషయంలో వ్యత్యాసాలపై విమర్శలు రావడంతో కేంద్రం ఎట్టకేలకు లీగల్ మెట్రాలజీ 2011 చట్టానికి చేసిన సవరణల చేసింది. కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఈ సవరణలను ఆమోదించారు. జనవరి 1 నుంచి అమలులోకి రానున్న చట్టం ప్రకారం ఏ వస్తువుకైనా ఇక నుంచి రెండు ఎంఆర్పీ ధరలు ఉండవు.

ఇది అమల్లోకి వస్తే మాల్స్, మల్టీ ప్లెక్సులు, ఎయిర్ పోర్టుల్లో ఎంఆర్పీలపై ఫిర్యాదులకు అడ్డుకట్ట పడుతుంది. దీని ప్రకారం వస్తువుపై ఒకే ధరను ముంద్రిచాలి. బయట ఒక ధర, మాల్స్, విమానాశ్రయాల్లో ఇంకో ధర ఉంటే కఠిన చర్యలు తప్పవు. మారిన నిబంధనల ప్రకారం ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో విక్రయించే అన్ని వస్తువులపైనా రిటైల్ ధరలను తప్పనిసరిగా ముద్రించాలి. దీనికి సంబంధించి కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. వినియోగదారుల కోసమే ఈ చట్టంలో సవరణలు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఉత్పత్తులపై ముద్రించే డిక్లరేషన్ అక్షరాల పరిమాణం కూడ చదవడానికి వీలుగా ఉండాలని కూడా సవరణలో చేర్చామని పేర్కొంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *