జనవరి 22న మున్సిపల్ ఎన్నిక లు

ఇప్పటికే ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి 7న నోటిఫికేషన్ వెలువడనుంది. 22న పోలింగ్ జరగనుంది. పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో టిఆర్ఎస్ అధిష్టానం ఉంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.మున్సిపల్ ఎన్నికలు దెగ్గరలోనే ఉండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఓటర్ల జాబితా పెట్టేందుకు ప్రయత్నిస్తొంది. ఓటర్ల అంతరంగాన్ని తెలుసుకునేందుకు మూడు సర్వేలు చేయిస్తున్నారు. ఒక సర్వే కోసం పార్టీ ముఖ్య నేతలను వినియోగించగా,మరొకటి పోలీస్ నిఘా విభాగం నుంచి తెప్పిస్తోంది. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా మూడో సర్వే చేయిస్తోంది. సేకరించాల్సిన సమాచారం ఒకటే అయినప్పటికీ వేర్వేరు వ్యక్తులు సంస్థల ద్వారా జరుగుతున్నాయి ఈ మూడు సర్వే లు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఈ ప్రక్రియను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.మునిసిపాలిటీల వారీగా పార్టీల బలాబలాలు సులభంగా గెలిచే స్థానాలే ఏవి, కష్టపడితే గెలుపొందే స్థానాలు ఏవి, పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల ఏం చేయాలి. కొత్త మునిసిపాలిటీల్లో పరిస్థితేమిటి. నేతల మధ్య సమన్వయం ఎట్లా అనే విషయాలు సర్వే అంశాలుగా ఉన్నట్టు సమాచారం వీటి ఆధారంగా క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను తెలుసుకోవచ్చని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. వార్డులు, డివిజన్ల వారీగా ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది. టీఆర్ ఎస్ అభ్యర్ధులుగా ఎవరైతే బాగుంటుందో కూడా నివేదికలో పొందుపరచాలని కోరారు. వార్డులు డివిజన్లలో జనాభా ఆధారంగా రిజర్వేషన్ ఎవరికి వస్తుందనేది అంచనా వేసి టిక్కెట్ ఎవరికివ్వాలో సూచించాలని ఆదేశించినట్టు సమాచారం. పాత,కొత్త సమాచారాన్ని పరిశీలించి ఈ నెల ముప్పై ఒకటి లోగా నివేదిక లు అందించా లని పార్టీ నేతలను అధిష్టానం ఆదేశించింది.అప్పటిలోగా పోలీస్ నిఘా విభాగం స్వతంత్ర ఏజెన్సీ సర్వే నివేదికలు అందుతాయని భావిస్తున్నారు. వాటన్నింటిని సమగ్రంగా పరిశీలించి స్పష్టమైన అంచనాకు రావాలని టీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించగా, సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు మునిసిపల్ ఎన్నికల పై దిశా నిర్దేశం చేయనున్నారు.టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్ర కమిటీ జడ్పీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు ఇతర సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీ జనవరి 2న ఉండవచ్చని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.మొత్తం మీద అధికారంలో ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ఈ మున్సిపల్ ఎన్నికల పై ప్రత్యేక దృష్టి పెట్టారనే భావించవచ్చు.చూడాలి మరి వారి కృషి ఏ మేర సత్ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *