నాగార్జున ఫోన్ నెంబర్ మార్చేశాడా?

ఇప్పుడు కింగ్ నాగార్జున హాట్ టాపిక్ గా మారడం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే ఒక ప్రక్కన ఓమ్ నమో వెంకటేశాయా రిజల్టు తేడా కొట్టేస్తే మరో ప్రక్కన అఖిల్ తన పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోవడం ఇంకా ఇరకాటాన పడేసింది. ఆల్రెడీ నాగార్జున ఇవన్నీ పట్టించుకోకుండా రాజు గారి గది 2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఒక కొత్త విషయం తెలుస్తోంది.

నిజానికి సినిమా ఫ్లాపైతే మన ఇండస్ర్టీలో పెద్దగా ఎవ్వరూ ఫీలవ్వరు కాని.. అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందనేసరికి నాగార్జునకు అందరూ తెగ ఫోన్లు చేస్తున్నారట. వారందరికీ ఆయన ఏం జరిగిందో వివరిస్తూ ఉంటే ఇక పుణ్యకాలం అంతా ఇట్టే గడిచిపోతుంది. అయితే అలా ఎంతమందికి నాగ్ ఏం జరిగిందో చెబుతుంటాడు? అందుకే తనకు వస్తున్న ఫోన్ల తాకిడి తట్టుకోలేక.. మనోడు వెంటనే ఫోన్ నెంబర్ మార్చేశాడని అంటున్నారు. అందులో నిజం ఉన్నా లేకపోయినా కూడా.. కొడుకు పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందంటే ఏ తండ్రికైనా బాధ ఉండటం కాయం. అలాంటప్పుడు వారిని ప్రశాంతంగా వదిలేయాలి కాని.. జనాలు కూడా ప్రశ్నలతో వేధించకుండా ఉంటే బెటర్.

ఇకపోతే అసలు అఖిల్ అండ్ శ్రీయ పెళ్ళయ్యాక గొడవలు పడి డైవర్స్ తీసుకోకుండా.. ముందుగానే విడిపోవడం మంచి పనే అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఈ ఇష్యూ ఇంతటితో వదిలేయడం బెటర్!!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *