నాగబాబు ఎందుకు కెలికాడో తెలుసా

మొన్న ఒక ఇంటర్వ్యూ లో తెలిసో తెలియకో లేక కావాలనో నాగబాబు అన్న మాటలు మెగా ఫాన్స్ మధ్య మళ్ళి చర్చకు దారి తీసాయి. పవన్ కళ్యాణ్ కున్న పర్సనల్ ఫాలోయింగ్ ఇంకే హీరోకు లేదు అన్నట్టు మాట్లాడి చిరంజీవి, అమితాబ్, రజనికాంత్ లాంటి వాళ్ళకు ఉంది సినిమా పరమైన ఫాన్స్ అనేలా అర్థం రావడంతో చిరు ఫాన్స్ నాగబాబు మీద భగ్గుమన్నారు.

అసలు చిరు కు పర్సనల్ ఫాలోయింగ్ లేకపోతే ఎనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత ఒక మామూలు మాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా  జనం ఆదరించరని, అలాంటిది ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఎక్కువ చేయటం కోసం చిరు ని తక్కువ చేయటం ఏమి బాలేదని కామెంట్ చేస్తున్నారు. చిరు, పవన్ కళ్యాణ్ పది రోజుల గ్యాప్ లో రెండు సార్లు కలిసారు. తమ పుట్టిన రోజుల సందర్భంగా ఒకరు ఉండే చోటుకి మరొకరు వెళ్లి మరీ విష్ చేసుకున్నారు.

దీంతో మరోసారి క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది ఫాన్స్ కు. కాని నాగబాబు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఖంగు తిన్న మెగా ఫాన్స్ ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఈ ఇష్యూ రైజ్ చేసారు అని అడుగుతున్నారు. నిజానికి చిరంజీవి అన్నా పవన్ అన్నా నాగబాబు కి ఒకే రకమైన అఫెక్షన్ ఉంది. కాని ఈ మధ్య కాలంలో పవన్ ని టార్గెట్ చేస్తూ ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నంలో కొన్ని వివాదాలు సృష్టించడం, పవన్ ఒకటి చెబితే దాన్ని మీడియా లో మరోలా ప్రమోట్ చేయటం లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివాటికి ప్రభావితం కాలేనంత ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కు ఉంది అని చెప్పడం నాగబాబు ఉద్దేశం. కాని మీనింగ్ మరోలా అర్థం కావడం మరో సారి రచ్చకు, చర్చకు అవకాశం ఇచ్చింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *