జబర్ధస్త్‌కు నాగబాబు గుడ్‌బై?

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ వార్తే వినిపిస్తోంది. అత్యంత సంచలనాత్మక కార్యక్రమం జబర్ధస్త్. ఈ కార్యక్రమానికి ఆయన ఓ జడ్జీగా వ్యవహరిస్తూ రోజాకు ధీటుగా నవ్వుతూ కామెంట్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని తనదైన రీతిలో నడిపిస్తారు ఆయనే నాగబాబు. జబర్ధస్త్‌లో కొన్ని జోకులకు నవ్వు వచ్చినా.. రాకపోయిన రోజా, నాగబాబు ఇకలింతలు చూసి కితకితలు పెట్టుకుని నవ్వే ప్రేక్షకులు లేకపోలేదు. మొత్తం మీద ఈ కార్యక్రమ నిర్వహణలో తనదైన ముద్ర వేసిన నాగబాబు త్వరలో ఈ కార్యక్రమం నుంచి తొలగిపోతున్నారని ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 1 లక్ష కూర్చోని సంపాదించే అవకాశాన్ని ఎవరు వదులుకోరు. అదంతా అబద్ధం ఆయన అమెరికా వెళ్తున్నారు. ఏదో సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని వారాలు ఈ కార్యక్రమానికి హాజరుకారని మరికొందరు చెబుతున్నారు. అందుకే నాగబాబుతో 11 ఎపిసోడ్లను ముందే తీస్తున్నారని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద నాగబాబు జబర్ధస్త్ కార్యక్రమంలో కొన్ని వారాలు కనిపించకపోవచ్చనే వార్త ఈ కార్యక్రమ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *